
దీటుగా స్పందించిన భారత రక్షణ వ్యవస్థలు
India Pakistan War | పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్ కూడా భారతదేశంపై పిరికితనంతో దాడి చేసింది. పూంచ్‌లో జరిగిన దాడిలో సాధారణ పౌరులు మరణించారు. నిన్న రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి భారతదేశంలోని అనేక నగరాలపై క్షిపణులు ప్రయోగించింది అయితే, భారత సైనిక వీరులు వాటన్నింటినీ గాల్లోనే నాశనం చేశారు. ప్రెస్ మీటింగ్‌లో అన్ని పరిణామాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని MEA పంచుకుంది.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి(sofia qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (vyomika singh) పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. భారతదేశంలోని ఏ సైనిక స్థావరంపైనైనా దాడి జరిగితే దానికి తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పునరుద్ఘాటించారు.
పాకిస్తాన్ దాడులకు భారత్ దీటైన సమాధానం
“మే 7-8 రాత్రి, పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూధియానామా, అవంతిపుర, ఆదంపూర్, బటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్ వంటి అనేక సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు క్షిపణులతో దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ దాడులను వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా ద్వంసం చేశాయి. ఈ దాడుల శిథిలాలను అనేక ప్రదేశాల నుండి స్వాధీనం చేసుకున్నారు, ఇది పాకిస్తాన్ దాడులకు నిదర్శనం.”
ఈ ఉదయం భారత సైన్యం పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు MEA సమావేశం తెలిపింది. లాహోర్‌లో ఉన్న ఒక వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు.
‘పాకిస్తాన్ కాల్పుల తీవ్రతను పెంచింది’
“ఎల్‌ఓసీలోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి సెక్టార్లలో పాకిస్తాన్ మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఫిరంగిని ఉపయోగించి ఎల్‌ఓసీ వెంట కాల్పుల తీవ్రతను పెంచింది. పాకిస్తాన్ కాల్పుల కారణంగా 3 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ వైపు నుండి మోర్టార్లు మరియు ఫిరంగి కాల్పులను విజయవంతంగా అడ్డుకుని ప్రతీకారం తీర్చుకున్నామని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.