Hyderabad Rain Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. .మరో ఆవర్తనం అండమాన్ సముద్రంలో సముద్ర మట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనంగా బలపడే చాన్స్ ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయు గుండంగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. , సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో..
AP Rain Alert ఇక ఏపీ యానాంలో ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఇక రాయలసీమలోనూ ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.