Monday, August 4Thank you for visiting

దూకుడు పెంచనున్న హైడ్రా.. తర్వాత లక్ష్యం అవే..

Spread the love

Hydra Pilot Project :  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వచ్చే ఆరునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చెరువులను సుందరీకరణ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.   హైడ్రా ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడుతూనే మరోవైపు చెరువులను సుందరీకరణ చేయాలని నిర్ణయించుకుంది.  హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువుల పూర్వభవం కోసం  పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. తొలివిడతగా నాలుగు చెరువుల సుందరీకరణ చేయాలని అది కూడా  ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో  బాచుపల్లి- ఎర్రగుంట చెరువు, మాదాపూర్- సున్నం చెరువు, కూకట్‌పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్- అప్పచెరువును హైడ్రా ఎంపిక చేసింది.

హైదరాబాద్ లో  తూర్పు, దక్షిణ, ఉత్తరం, పశ్చిమ వైపులా ఒక్కో చెరువును ఎంపిక చేసుకుంది. తొలుత చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్ పూర్తి చేయనుంది. ఇందుకు నెలరోజుల సమయం కేటాయించనుంది. తర్వాత చెరువుల చుట్టూ ఫెన్సింగ్‌, ఆ తర్వాత సుందరీకరణ పనులు చేపడుతుంది.  దాదాపు 200 కోట్ల రూపాయలతో చెరువుల సుందరీకరణ పనులు చేపట్టనుంది. నాన్ రియల్ ఎస్టేట్ సంస్థలకు సీఎస్ఆర్ కింద వాటిని అప్పగించాలని యోచిస్తోంది. ఆక్రమణల నుంచి కాపాడిన చెరువుల వద్ద ఇప్పటికే సీసీ కెమెరాలతోపాటు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వొచ్చే ఏడాదిలోపు మిగిలిన చెరువులను బ్యూటిఫికేషన్ కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *