నోరూరించే నీరా పానీయం రెడీ..

నోరూరించే నీరా పానీయం రెడీ..

నెక్లెస్ రోడ్డులో రూ.13కోట్లతో నీరా కేఫ్ ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్‌ వాసులకు కిక్కిచ్చే నీరా కేఫ్ ( Neera Cafe ) అందుబాటులోకి వచ్చింది. తాటి చెట్ల నుంచి తీసే నాన్ ఆల్కహాలిక్ పానీయాన్ని అందించే నీరా కేఫ్‌ను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గీతకార్మికులను ప్రోత్సహించేందుకు రూ.13 కోట్లతో నెక్లెస్ రోడ్డు (Necklace Road) లో నిర్మించిన ఈ నీరా కేఫ్ నెక్లెస్ రోడ్‌లో ఆకర్షణీయంగా నిలిచింది.

నీరా మట్టి కుండలతో ఉన్న తాటి చెట్లు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఒకేసారి సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో మాదిరిగా తాటివనాలు, ఈదుల్లో కూర్చొని కళ్లు తాగుతూ ఎంజాయ్ చేసిన అనుభూతి కలిగేలా ఈ కేఫ్ ను నిర్మించారు. తాటి, ఈత చెట్ల నమూనాల్లో సీటింగ్ అరెంజ్ చేశారు. కేఫ్ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి కుండలు కట్టి.. చూడడానికి పల్లెటూరి వాతావరణాన్ని సృష్టించారు. ఈ కేఫ్ పైకప్పును కూడా తాటి ఆకుల ఆకారంలో డిజైన్ చేశారు అధికారులు. ఈ కేఫ్‌లో ప్రస్తుతం ఏడు స్టాల్స్ సిద్ధంగా ఉన్నాయి. త్వరలో మరికొన్ని కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

READ MORE  KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

తాటి, ఈత, కొబ్బరి, కర్జూరా జీలుగ..

తాటి, ఈత, కొబ్బరి చెట్లతో పాటు ఖర్జూర, జీలుగ చెట్ల నుంచి పలు రకాల నీరాను ఉత్పత్తి చేస్తారు. సాధారణంగా.. తాటి, ఈత చెట్లకు.. కొంత నీరు, మడ్డి కలిపిన కుండను చెట్టుకు కట్టడం వల్ల కల్లు వస్తుండగా… నీరాను మాత్రం కొత్తకుండలో ఎలాంటి నీరు, మడ్డీ వేయకుండా తాజాగా తయారు చేస్తారు. ఇందులో 4 శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అయితే, నీరాకు తక్కువ నిల్వ సామర్థ్యం ఉటుంది. 4 డిగ్రీల వద్ద ఉంచితే.. 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పటి వరకు శ్రీలంక, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఆఫ్రికా వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా జరుగుతుంది.

READ MORE  BJP campaign video : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన  బీజేపీ 

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

ఏ చెట్టు నుంచి తయారు చేసిన నీరా అయినా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుందన్నది. నీరాలో.. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, ప్రొటీన్, షుగర్, విటమిన్-సి కలిగి ఉంటాయని పలువురు తెలిపారు.. వ్యాధులను నివారించే ఔషధగుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఇది శరీరంలో అంతర్గత ప్రక్షాళన చేసే మెకానిజాన్ని మెరుగుపరిచే సామర్యం కలిగి ఉందని.. ఫలితంగా షుగర్, లివర్, గుండె సమస్యల వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని చెబుతారు. hyderabad neera cafe

నీరా కేఫ్ ను ప్రారంభించిన అనంతరం ఎక్సైజ్‌ శాఖ మంత్రి మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 4.20 కోట్లకు పైగా తాటి మొక్కలు నాటారు. ఆ తాటి చెట్లను ఎవరైనా నరికివేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గీతకార్మికులకు బీమా పథకం
కల్లుగీత కార్మికులకు ప్రమాద బీమా మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రస్తుతం చెల్లిస్తున్న ఎక్స్ గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. అలాగే శాశ్వత వికలాంగులకు గతంలో ఇచ్చే రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని రూ.5లక్షలకు పెంచామని, రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రత్యేక పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. hyderabad neera cafe

READ MORE  వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్

నీరా కేఫ్ గురించి సంక్షిప్తంగా..

  • ఖర్చు: రూ.13 కోట్లు
  • సీటింగ్ కెపాసిటీ: 300-500
  • సమయాలు: ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు
  • కేఫ్ టేక్-అవే సౌకర్యం ఉంది
  • దేశంలోనే తొలి నీరా కేఫ్
  • ఇందులో ఫుడ్ కోర్ట్ ఉంది
  • నీరా ఆల్కహాల్ లేని సహజ ద్రవం
  • తాటి, ఈత, కొబ్బరి చెట్లతో పాటు ఖర్జూరం, జీలుగ చెట్ల నుంచి నీరను ఉత్పత్తి చేస్తారు
  • కేఫ్ నుంచి బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యం కూడా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *