ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..
1 min read

ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..

Spread the love


Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 :15 గంటలకు బయలు దేరి 1:10 గంటలకు గమ్యం చేరుకోనుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ కొత్త షెడ్యూల్ అందుబాటులో ఉంటుంది. ఇది ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచులు వీక్షించేవారికి.. ఆ మార్గాల గుండా ప్రయాణించేవారికి ఉపయోగపడుతుంది. మార్చి 22న నుంచి -2025 సీజన్‌ స్టార్ట్‌ అవుతున్న క్రమంలో హైదరాబాద్ మెట్రో ఈ సౌకర్యాన్ని కల్పించింది. మార్చి 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిసేవరకు ఆ స్టేషన్ల గుండా చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు మొదలై.. రాత్రి 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో (Hyderabad Metro) యాజమాన్యం ప్రకటించింది.

ఉప్పల్ స్టేడియంలలో 9 మ్యాచ్ లు

కాగా భారత్‌లో బిగ్‌ క్రికెట్‌ ఫెస్టివల్‌ ‘‘IPL-2025’’ మార్చి 22 నుంచే అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(kolkata knight riders), రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్లు తలపపడ్డాయి. తెలంగాణలోని ఐపీఎల్‌ అభిమానులకు పెద్ద పండగే ఉంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియం (Uppal Stadium) ఈ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్‌లో జరగనున్న 9 మ్యాచుల్లో 7 లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి ఇందులో ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు రెండు ఉన్నాయి. ఉప్పల్‌లో ఈ ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో హోమ్‌ టీమ్‌ హైదరాబాద్ సన్‌రైజర్స్‌ (sunrisers hyderabad).. రాజస్థాన్‌ రాయల్స్‌ (rajasthan royals)తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం ప్రారంభమవుతుండగా.. హైదరాబాద్‌లో జరిగే మిగిలిన మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 27న లక్నో, ఏప్రిల్‌ 6న గుజరాత్‌, ఏప్రిల్‌ 12న పంజాబ్‌, ఏప్రిల్‌ 23న ముంబై, మే 5న దిల్లీ, మే 10న కోల్‌కతా టీమ్స్‌తో తలపడుతుంది. ఇక మే 20న క్వాలిఫయర్‌-1, మే 21న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు ఉప్పల్‌లో జరుగుతాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *