Tuesday, February 10"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

Spread the love

Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉగాది సందర్భంగా మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు, కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని.. ప్రయాణికులకు మెరుగైన సేవలను సైతం అందిస్తామని పేర్కొన్నారు.ఎల్ అండ్ టీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి రైలు వస్తుండటంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలో మెట్రో రైల్‌లో వెన్నుముకగా ఉండనున్నాయని పేర్కొన్నారు.

Metro Rail : మెట్రో రైళ్ల పొడిగింపు

ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్లుగా మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించేందుకు తమ టెర్మినల్ స్టేషన్‌ల నుంచి చివరి రైలు బయలుదేరే సమయం 1 ఏప్రిల్ 2025 నుంచి ప్రస్తుతమున్న 11:00 పీఎం నుంచి 11:45 ఏఎం (సోమవారం నుంచి శుక్రవారం వరకు) మార్చినట్లు తెలిపారు. మొదటి రైలు టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఆదివారాల్లో మాత్రం ఉదయం 7:00 గంటలకు బయలుదేరుతుందని అన్నారు.అలాగే హైదరాబాద్ మెట్రోలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఈమేరకు 20 ట్రిప్పుల నుంచి 30 ట్రిప్పులకు విద్యార్థులు పొందే-ఆఫర్‌ను మరో సంవత్సరం పాటు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఇది 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (SSO), ఆఫ్-పీక్ తగ్గింపు ఆఫర్ 31 మార్చి 2025న ముగిసిపోతుందని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *