హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Durga Devi Mandir attack | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్ పోలీసులు కూడా నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దుండగులు.. మొదట అక్కడ కరెంట్ సరఫరా కట్ చేసి ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత దుర్గాదేవి అమ్మవారి విగ్రహం చేతిని విరగ్గొట్టారు. విగ్రహం వద్ద పూజా సామగ్రిని సైతం చిందరవందరగా పడేశారు. అమ్మవారి విగ్రహం ఉన్న బారికేడ్లను కూడా తొలగించారు.
అయితే ప్రతీ సంవత్సరం ఎక్కడో చోట హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. మనం హిందూ దేశంలో ఉన్నామా? లేదా ఇస్లామిక్ దేశంలో ఉన్నామా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాగా గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా దాండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అయ్యే వరకు పోలీసులు అక్కడే విధులు నిర్వహించారని స్థానికులు తెలిపారు. అమ్మవారి విగ్రహ ధ్వంసం అర్ధరాత్రి లేకుంటే… శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉండవొచ్చని పోలీస్ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణలో భాగంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..