BSNL 4G SIM : మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఇలా ఎంచుకోండి..
BSNL 4G SIM | Airtel, Jio, వొడఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొద్ది రోజుల క్రితం టారిఫ్ లను పెంచడంతో భారతదేశంలో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్ల కోసం BSNLకి మారుతున్నారు. దీంతో పాటు, BSNL దేశవ్యాప్తంగా తన 4G సేవలను కూడా దశలవారీగా ప్రారంభిస్తోంది. దీని 4G సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో పనిస్తున్నాయి.
కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ (BSNL 4G SIM ) కొనాలనుకునే వారికి, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ కొత్త సబ్‌స్క్రైబర్‌లను వారికి ఇష్టమైన మొబైల్ నంబర్‌ని ఎంచుకునేలా అవకాశం కల్పిస్తోంది. మీరు మీ కొత్త BSNL SIM కోసం మీ ఇష్టమైన మొబైల్ నంబర్‌ను పొందాలని ఆసక్తి కలిగి ఉంటే, మీరు దీన్ని ఎలా చేయాలనే దాని గురించి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
మీ BSNL మొబైల్ నంబర్‌ను ఎంచుకునేందుకు ఇలా చేయండి..
- 1: ముందుగా Google search వంటి ఏదైనా సెర్చ్ ఇంజిన్‌కి వెళ్లి ‘BSNL Choose Your Mobile Number’.’ అని సెర్చ్ చేయండి.
- 2: బిఎస్ఎన్ఎల్ ‘cymn’ లింక్‌పై క్లిక్ చేయండి
- 3: సౌత్, నార్త్, ఈస్ట్, వెస్, లలో మీ జోన్‌ను ఎంచుకోండి. అలాగే మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి
- 4: BSNL కొత్త సబ్‌స్క్రైబర్‌లను సిరీస్, స్టార్ట్ నంబర్, ఎండ్ నంబర్ లేదా నంబర్‌ల మొత్తంతో ప్రాధాన్య నంబర్‌ల కోసం సెర్చ్ చేయడానికి అనుమతిస్తుంది.
- మీరు ‘ఫ్యాన్సీ నంబర్’ ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫ్యాన్సీ నంబర్‌ను కూడా చెక్ చేయవచ్చు.
- 5: మీకు ఇష్టమైన నంబర్‌ని ఎంచుకున్న తర్వాత, ఎంచుకున్న నంబర్‌ను రిజర్వ్ చేయడానికి ‘ ‘Reserve Number’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- 6: నంబర్‌ను రిజర్వ్ చేయడానికి OTPని స్వీకరించేందుకు మీ ప్రస్తుత నంబర్‌ను ఎంటర్ చేయండి.
- 7: మీరు ఎంచుకున్న ఫోన్ నంబర్‌ను రిజర్వ్ చేయడానికి OTPని నమోదు చేయండి
- 8: మీ నంబర్‌ను రిజర్వ్ చేసిన తర్వాత, మీరు ఇష్టపడే నంబర్‌తో BSNL సిమ్‌ని పొందడానికి సమీపంలోని BSNL కార్యాలయాన్ని సందర్శించాలి.
కాగా బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గత శనివారం (జూలై 27) తన X హ్యాండిల్ ద్వారా ప్రకటించింది . అయితే, ఈ యాక్టివేషన్‌లు డైరెక్ట్‌గా ఉన్నాయా లేదా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ద్వారా ఉన్నాయా అనేది కంపెనీ వెల్లడించలేదు. BSNL ఈ ఏడాది మేలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తన 4G సేవను ప్రారంభించింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “BSNL 4G SIM : మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఇలా ఎంచుకోండి..”