భారీ వర్షాలతో తెగిన రోడ్లు.. గర్భిణిని కొండలు దాటుకొని కుర్చీపై హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లిన గ్రామస్థులు
డెహ్రాడూన్: ఉత్తరఖండ్ లో భారీ వర్షాల(heavy rains) కారణంగా ఈ వారం చమోలిలో కొండచరియలు విరిగిపడడంతో రహదారులన్నీ తెగిపోయాయి.
దేవల్ ప్రాంతంలోని బాన్ గ్రామంలోని స్థానికులు తమకు ఉన్న ఏకైక రహదారిని కోల్పోయారు. ఈ క్రమంలోనే 29 ఏళ్ల కిరణ్ దేవికి ప్రసవ నొప్పులు రావడం మొదలైంది. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆమెను ప్లాస్టిక్ కుర్చీపై ఉంచి, తమ భుజాలపై పైకి లేపి, కనుమలు, కొండ ప్రాంతాల శిథిలాల మీదుగా కాలినడకన ఎంతో శ్రమించి చమోలి (Chamoli)లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మోసుకెళ్లారు. చివరికి ఆరోగ్యకేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో కిరణ్ గురువారం అర్థరాత్రి మగబిడ్డను ప్రసవించింది. అయితే ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కొండ ప్రాంతాల ప్రజలు పడుతున్న అవస్థలను ఇది వెలుగులోకి తెచ్చింది.
ఇలాంటి వర్షం ఎప్పుడూ చూడలేదు…
“దేవాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC) మా గ్రామానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ
వర్షాలకు మా ఊరి రోడ్డు ధ్వంసమైంది. 3 కి.మీ.కు పైగా ప్రయాణం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారింది. కిరణ్‌ను మోసే వ్యక్తులు లోతైన వాగును
దాటవలసి వచ్చింది. రెండు పాయింట్ల మధ్య ఉంచిన పైపులు, కర్రలపై తమను తాము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాము. మాకు మరో ప్రత్యామ్నాయం లేదు అని స్థానికుడు ఖిలాఫ్ సింగ్ అన్నారు. గత 55 ఏళ్లలో గ్రామం “ఈ స్థాయి విధ్వంసం” చూడలేదని సింగ్ తెలిపారు.
చమోలీలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ అదృష్టవశాత్తు కిరణ్, ఆమె బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. ఒక ఆశా వర్కర్
తల్లితో పాటు ఉన్నారు.”అని తెలిపారు.
heavy-rains in India
#Uttarakhand Watch how a pregnant woman is being taken to a hospital, video from Van gaon in Chamoli’s Dewal block. Roads, bridges, highways have been washed away due to heavy rains. Successive govts have failed to enhance rural connectivity or provide basic health infrastructure pic.twitter.com/qWsmG87TpJ
— Noman Siddiqui (@nomanssiddiqui) August 18, 2023
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.