
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ఫిలిం హరి హర వీరమల్లు (Harihara veeramallu). 5 ఏళ్ల క్రితం క్రిష్(krish) డైరెక్షన్ లో మొదలైన ఈ మూవీ పవన్ రాజకీయల్లో బిజీ అవడం వల్ల బ్రేక్ పడింది.దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. మిగతా భాగాన్ని మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ(Jyothi Krishna)టేకాఫ్ చేసి కంప్లీట్ చేశారు.
పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే…. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం…ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం..అని అర్జున్ దాస్ డైలాగ్ మూవీ పై అంచనాలను పెంచేసింది.
ఫైట్స్ ఇరగదీసిన పవన్….
గుర్రం మీద పవన్ వస్తుంటే బీజీఎం అదిరిపోయింది. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే యోధుడిగా పవన్ అదరగొట్టారు. ఫైట్స్ ఇరగదీశారు. ఫ్యాన్స్ లో మొదటి నుండి సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు అనే ఓ కంప్లైంట్ ఉంది. మూవీకి ఎలాంటి బిజీఎం ఇస్తాడో అనే టెన్షన్ పడ్డారు. ఇలాంటి భారీ మూవీలో మ్యూజిక్ ఆకట్టుకోలేకపోతే మూవీ పై ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నారు. కానీ ఈ ట్రైలర్ తో అన్ని అనుమానాల్ని పటాపంచలు చేశారు కీరవాణి.
కీరవాణి బీజీఎం నెక్స్ట్ లెవెల్…
ట్రైలర్ లో ఆస్కార్ విన్నర్ కీరవాణి( MM Keeravani)బీజీఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మరోసారి కీరవాణి తన సత్తా ఏంటో ఈ మూవీతో చూపించారని అనిపించింది. ట్రైలర్ మొత్తం గూస్బంప్స్ వచ్చేలా ఇచ్చిన బీజిఎం తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వీఎఫ్ఎక్స్ పరంగా ఏ మాత్రం నెగిటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ ఖర్చుతో తీసిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోగా ఈ ట్రైలర్ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. భారీ ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లో అగుపడుతుంది. ఈ సారి వీరమల్లు బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. జూలై 24న హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.