Geyser Buying Guide | మీ ఇంటికి బెస్ట్ గీజర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మార్కెట్‌లో చాలా ఎన్నో కంపెనీలకు చెందిన వివిధ రకాల గీజర్లు అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో వెచ్చని నీటితో స్నానం చేసేందుకు వేగంగా, సురక్షితంగా ఉండే ఉత్తమమైన వాటర్ హీటర్‌ను ఎంచుకోవాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అనేక గీజర్లు అందుబాటులో ఉన్నందున వాటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. గీజర్లపై ఒక అవగాహన కోసం ఈ ముఖ్య విషయాలను తెలుసకోండి..
ఇన్‌స్టంట్ గీజర్ వర్సెస్ స్టోరేజ్ గీజర్
ఇన్‌స్టంట్ గీజర్లు (Instant geysers ) కాంపాక్ట్ ఉండి నీటిని వేగంగా వేడి చేస్తాయి. ఈ గీజర్‌లను చిన్న కుటుంబాలు లేదా ఒంటరిగా ఉండేవారికి అనువుగా ఉంటాయి. అంటే రోజువారీగా తక్కువ వేడి నీరు అవసరం అయ్యేవారికి ఇన్‌స్టంట్ గీజర్లు సరిపోతాయి.
స్టోరేజ్ గీజర్లు (Storage geysers) పెద్ద ట్యాంక్ సామర్థ్యంతో వస్తాయి. ఈ గీజర్‌లు బాత్‌రూమ్‌లు, పెద్ద కుటుంబాలకు (ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో) అనుకూలంగా ఉంటాయి. వారు ఎక్కువ కాలం వేడి నీటిని ఒడిసి పట్టి ఉంచగలవు. అయితే ఇవి పెద్ద పరిమాణంలో ఉండి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలాగే కొంచెం ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తారు.
కుటుంబం ఆధారంగా ఎంచుకోండి..
- చిన్న గృహాలకు, మీకు 10-15 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న గీజర్ అవసరం..
- పెద్ద కుటుంబాలకు, 15-25 లీటర్ల సామర్థ్యం కలిగిన గీజర్ సరిపోతుంది.
- రోజువారీ వేడి నీటి అవసరాల కోసం, అవసరాన్ని బట్టి, కెపాసిటీని కలిగి ఉండే గీజర్‌ని కొనుగోలు చేయాలని గుర్తుంచుకోవాలి.
ఎనర్జీ రేటింగ్‌లు
ఎనర్జీ ఎఫిసియన్సీకి BEE స్టార్ రేటింగ్ చాలా ముఖ్యమైనది. 5-స్టార్ రేటింగ్‌తో కూడిన గీజర్‌కు కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది, అయితే ఇవి విద్యుత్ ను తక్కువగా వినియోగించుకుంటాయి. కాబట్టి దీర్ఘకాలికంగా విద్యుత్ బిల్లులను పొదుపు చేయవచ్చు.
కాబట్టి ఎక్కువ -స్టార్ రేటింగ్‌ను ఎంచుకోవడం అంటే ఎకో-ఫ్రెండ్లీ ఆప్షన్, ఇది శక్తిని ఆదా చేస్తుంది.
వాటర్ ట్యాంక్ మెటీరియల్
- Geyser Guide స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా రాగితో తయారు చేసిన ట్యాంక్‌లతో కూడిన గీజర్‌లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, ఎందుకంటే అవి తుప్పుకు గురయ్యే అవకాశం తక్కువ. ముఖ్యంగా కఠినమైన నీరు ఉన్న ప్రదేశాలలో ఇవి తట్టుకుని పనిచేస్తాయి.
- కొన్ని గీజర్‌లు యాంటీ-రోసివ్ పూతలతో వస్తాయి, ఇవి మన్నికను పెంచడంలో, నీరు సురక్షితంగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి.
భద్రతకు ప్రాధాన్యమివ్వండి
గీజర్ల విషయంలో సేఫ్టీకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు గీజర్ కోసం చూస్తున్నట్లయితే, ఆటోమేటిక్ షట్-ఆఫ్, థర్మోస్టాట్ కంట్రోల్, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్‌లు ఇందులో ఉన్నాయా లేదా అని నిర్ధారంచుకోవాలి.
ISI-ధృవీకరించబడిన గీజర్ అనేది నాణ్యతకు సేఫ్టీకి మరొక సూచన, ఇది మనశ్శాంతిని అందిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు