Ganesh Chaturthi 2024 : గణేశుడిని ఆహ్వానించే ముందు ఈ కీలక విషయాలు గుర్తుంచుకోండి..
Ganesh Chaturthi 2024 | చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా భక్తి పారవశ్యంతో జరుపుకునే వినాయక నవరాత్రోత్సవాలు సమీపిస్తున్నాయి.గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు వినాయక మండపాల ఏర్పాట్లలో మునిగిపోయారు. పండుగ వేళ ఇళ్ళు, పరిసరాలు కోలాహలంగా మారిపోతున్నాయి. మీరు బహుశా ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వచ్చే గణేష్ చతుర్థికి సిద్ధమవుతున్నారా? అయితే ఈ కీలక విషయాలను గుర్తుంచుకోండి..
పర్యావరణ అనుకూల విగ్రహం
Ganesh Chaturthi 2024: మట్టి వంటి సహజ పదార్థాలతో రూపొందించిన గణేశ విగ్రహాన్ని ఎంచుకోండి. పర్యావరణ అనుకూలమైన విగ్రహాలు పర్యావరణానికి హాని చేయవు. అవి తేలికగా నీటిలో కరిగిపోతాయి. ఉదాహరణకు, మట్టి విగ్రహాలు మరింత పర్యావరణ అనుకూలమైనవి. ఎందుకంటే అవి నీటిలో కరిగిపోతాయి. మీరు పర్యావరణ అనుకూల వేడుకలు జరపుకునేందుకు సహజ రంగులు, వస్తువులతో పనిచేసిన విగ్రహాలనే ఎంచుకోండి..
వినాయక మండపం
మీ గణేష్ మండపం కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని కేటాయించండి. మీకు గది వైశాల్యం తక్కువగా ఉన్నట్లయితే, మీరు తాత్కాలిక మండపంగా గోడకు అమర్చిన షెల్ఫ్‌ను ఉపయోగించవచ్చు. ఆ ప్రాంతం రోజువారీ పూజకు సిద్ధంగా ఉందని, చక్కగా ఉండేలా, తగినంత వెంటిలేషన్‌ను కలిగి ఉండేలా చూసుకోండి. పండుగ ఆధ్యాత్మిక ఆచారాలు, పూజా కార్యకలాపాలకు అనువైన ప్రశాంత వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.
పరిశుభ్రతకు ప్రాధాన్యం
ప్రార్థనల్లో లీనమయ్యేంందుకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మండపం చుట్టూ ఉన్న పరిసరాలను తొమ్మిది రోజుల పాటు శుభ్రంగా ఉంచుకోం డి. క్రమం తప్పకుండా ప్రాంతాన్ని చెత్త రహితంగా చక్కగా ఉంచాలి. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి, విద్యుత్ దీపాలు లేదా అలంకరణలు సురక్షితంగా ఉంచుకోండి..
మండపాన్ని అలంకరించండి:
మీ మండపాన్ని అలంకరించడానికి మార్కెట్లో చాలా డెకరేషన్ వస్తువులు ఉన్నాయి. పువ్వులు, వాల్ హ్యాంగింగ్‌లు, రంగురంగుల తెరలు, పండుగ థీమ్ ఉన్న వస్తువులను ఎంచుకోండి. గణేష్ చతుర్థి ఉత్సవాల్లో దీపాలంకరణ చాలా ముఖ్యం. చీకటిపై కాంతి విజయాన్ని సూచించడానికి మండపం చుట్టూ విద్యుత్ దీపాలు లేదా నూనె దీపాలను వెలిగించండి..
ప్రసాదం
మతపరమైన వేడుకల్లో ప్రసాదం కీలకమైనది. గణేశుడికి స్వీట్లు, పండ్లు, మోదకాలతో సహా అనేక రకాల నైవేద్యాలను సిద్ధం చేయండి. ప్రసాదం పరిశుభ్రత, తాజాగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతీ రోజు సాంప్రదాయ గణేష్ చతుర్థి భజనలు, భక్తి పాటలను ప్లే చేయండి. సంగీతం వేడుక స్ఫూర్తిని పెంచడమే కాకుండా ఆరాధన ఉత్సవాల కోసం మరింత లీనమయ్యే చేస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..