Fixed Deposit Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి
Fixed Deposit Rates | గత రెండు నెలల్లో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌యులు) తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. ఆగస్టులో యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు తమ FD రేట్లను అప్‌డేట్ చేశాయి. ప్రస్తుతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 333 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.40 శాతం వరకు అత్యధికంగా వడ్డీ రేటును అందిస్తోంది. అదనంగా, సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) అదనపు 0.50 శాతం వడ్డీని అందుకుంటారు. అయితే సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు) వారి FDలపై అదనంగా 0.75 శాతం మంజూరు చేస్తారు.
SBI స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) “అమృత్ వృష్టి” అనే కొత్త లిమిటెడ్ పిరియడ్ ఫిక్స్ డ్ డిపాజిట్ (FD) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం 444 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. ఈ స్పెషల్ FDలో పెట్టుబడులు SBI బ్యాంక్ శాఖలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, YONO యాప్ ద్వారా చేయవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా FD
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ పథకం కింద, సాధారణ ప్రజలకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్‌సూన్ ఆఫర్
బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది, ఇది 399 రోజుల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 7.25 శాతం, 333 రోజుల కాలవ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 7.15 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక సెంట్రల్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.30శాతం,
ఇండియన్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.25 నుంచి వడ్డీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 333 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై 7.40 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి.
గమనిక : ఈ కథనం సమాచారం కోసం మాత్రమే.. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు దయచేసి SEBI-నమోదిత పెట్టుబడి సలహాదారులను సంప్రదించండి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..