Friday, April 18Welcome to Vandebhaarath

Fire-Boltt Oracle : 4G సిమ్ సపోర్ట్ తో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది.. దీని ధర, ఫీచర్లు ఇవే..

Spread the love

Fire-Boltt Oracle Smart Watch : భారతదేశంలో ఫైర్-బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్‌వాచ్  లాంచ్ అయింది.  గతంలో కంపెనీ 2.02-అంగుళాల స్క్రీన్‌తో ఫైర్ -బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒరాకిల్ మోడల్ కాస్త  చిన్న స్క్రీన్‌తో వస్తుంది.  ఇది Android-ఆధారిత UIపై పనిచేస్తుంది.  అనేక Google Play స్టోర్ అప్లికేషన్‌లకు సపోర్ట్ ఇస్తుంది, అలాగే  Android , iOS రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది దేశంలో వివిధ రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, స్మార్ట్ వేరబుల్ నానో-సిమ్ ద్వారా 4G LTE కాలింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

 ఫైర్-బోల్ట్ ఒరాకిల్ ధర

Fire-Boltt Oracle Price : భారతదేశంలో Fire-Boltt Oracle  ఎక్లిప్స్-ఫ్లెక్స్, మెరైన్-మిరాజ్, ఒనిక్స్-వేవ్, ఆరెంజ్-హారిజన్, క్లౌడ్-విస్పర్  క్రిస్టల్-టైడ్ కలర్ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 4,999 గా ఉంది. అలాగే   క్లౌడీ-క్లాస్ప్,  బ్లాక్-క్రోమ్ ఎంపికల ధర వరుసగా రూ. 5,299 , రూ. 5,499గా ఉంది.  ఈ వాచ్ ఫైర్-బోల్ట్ ఇండియా వెబ్‌సైట్  ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది .

READ MORE  TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

స్పెసిఫికేషన్స్, ఫీచర్లు

ఫైర్-బోల్ట్ ఒరాకిల్ 320 x 386 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.96-అంగుళాల IPS స్క్రాచ్-రెసిస్టెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Android-ఆధారిత FireOS అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ తో వస్తుంది.  మెయిల్ GPU, 2GB RAM,  16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో కూడిన  కార్టెక్స్ క్వాడ్-కోర్ ARM SoC ద్వారా ఈ స్మార్ట్ వాచ్ పనిచేస్తుంది.  స్మార్ట్ వాచ్ అనేక  వాచ్ ఫేస్‌లు మల్టీ  స్పోర్ట్స్ మోడల్‌లతో వస్తుంది. ఇది హార్ట్ రేట్ సెన్సార్,   బ్లడ్  ఆక్సిజన్  మానిటర్ సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది.

READ MORE  బడ్జెట్ ధరలోనే సరికొత్త ఫీచర్లతో Moto G35 5G ఫోన్ లాంచ్

స్మార్ట్ వేరబుల్ వాయిస్ సహాయంతో పాటు ఇన్‌బిల్ట్ స్పీకర్‌లను పొందుతుంది. ఇది వినియోగదారులకు కాల్‌లను సజావుగా  కమ్యూనికేట్ చేయడంలో సహాయపడుతుంది. ఒరాకిల్ భారతదేశంలో 4G నానో-సిమ్ కార్డ్ ద్వారా 4G LTE కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది.  Wi-Fi కనెక్టివిటీకి కూడా మద్దతు ఇస్తుంది.

తప్పిపోయిన వారిని సురక్షితంగా ఇంటికి తిరిగి రప్పించే QR కోడ్- పెండెంట్లు

ఫైర్-బోల్ట్ యొక్క ఒరాకిల్ 700mAh బ్యాటరీతో వస్తుంది.  స్టాండ్‌బై సమయం 72 గంటల వరకు,  గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ ను ఇస్తుది.  ఇది  బ్లూటూత్ 5.0,  GPS కనెక్టివిటీకి కూడా  సపోర్ట్ ఇస్తుంది. ఫైర్-బోల్ట్ డ్రీమ్ లాగా, ఈ కొత్త స్మార్ట్‌వాచ్ కూడా సోషల్ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ , ఫుడ్ డెలివరీ, రైడ్ బుకింగ్,  షాపింగ్ వంటి అనేక Google Play స్టోర్ అప్లికేషన్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది దుమ్ము,  స్ప్లాష్ నిరోధకత కోసం IP67 రేటింగ్‌తో వస్తుంది.

READ MORE  Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఆపిల్ డే సేల్స్ ప్రారంభం iPhone 16 Pro, MacBooks పై భారీ డిస్కౌంట్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *