‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం..

శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్‍గా మారాయి.
సౌత్ ఏషియన్ ఫుల్‍బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్‍షిప్ టోర్నమెంట్ టైటిల్‍ను ఇండియా ఫుల్‍బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్‍లో కువైట్‍పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో రెండు జట్లు సమానంగా నిలవగా… తర్వాత పెనాల్టీ షూ టౌట్ జరిగింది. ఇందులో 5-4తో భారత జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగిం ది. టీమిండియా గెలుపొందగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ‘‘మా తుఝే సలాం’’ అనే పాటను ముక్తకంఠంతో పాడారు. వందేమాతరం అంటూ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి.

READ MORE  Gold and Silver Price Today : తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవీ..

బెంగళూరు లోనిశ్రీకంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍ పోటీకి సుమారు 26 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. షూ టౌట్‍లో ఇండియా విజయం సాధించిన తర్వాత అందరూ నిలబడి మా తుఝే సలామ్ అనే పాటను పాడారు. సుప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ఈ దేశభక్తి గీతాన్ని అందరూ చాలా లయబద్ధంగా పాడారు. వందే..మాతరం అంటూ దేశభక్తిని ఉప్పొంగించారు. వేలాది మంది ఒకేసారి గొంతుకలిపి పాటను ఆలపించడంతో స్టేడియమంతా దద్దరిల్లిపోయింది. ఈ వీడియో చూస్తే.. రోమాలు నిక్కబొడుచోకవడం ఖాయం అంటూ ఫ్యాన్ కోడ్‍ ఒక వీడియోను పోస్ట్ చేసింది. చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
మ్యాచ్ గెలిచిన తర్వాత భారత ప్లేయర్స్ భావోద్వేగంతో మైదానంలో ఆనందబాష్పాలు రాల్చారు. కెప్టెన్ సునీల్ ఛెత్రీ ని టీమిండియా ప్లేయర్లు భుజాలపైకి ఎత్తుకొని స్టేడియంలో కలియతిప్పారు. ఆ సమయంలో స్టేడియం అభిమానుల నినాదాలు మిన్నంటాయి.

READ MORE  చంద్రయాన్​–3 సక్సెస్​.. జాబిలమ్మపై సేఫ్​గా ల్యాండ్​ అయిన విక్రమ్​

ఇక మ్యాచ్ విషయానికొస్తే, సమయం పూర్తయ్యేవరకు భారత్, కువైట్ చెరో గోల్ చేయటంతో 1-1తో టై అయ్యింది టై బ్రేకర్ కోసం ఫెనాల్టీ షూటౌట్ జరిగింది. పెనాల్టీ లోనూ ఓ దశలో రెండు జట్లు 4-4 స్కోర్ చే శాయి. అయితే, ఆ సమయంలో భారత క్రీడాకారుడు మహేశ్ గౌడ్ విజయవంతంగా బంతిని గోల్ పోస్టులోకి వేశాడు. తర్వాత కువైత్ ప్లేయర్ ఖలీద్ హజి యా కొట్టిన బంతిని భారత గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సక్సస్ ఫుల్ గా ఆపాడు. దీంతో భారత్ 5-4తేడాతో విజయం సాధించింది.

READ MORE  హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ఆదిత్య-ఎల్1 లాంచ్ ప్రత్యక్ష ప్రసారం

 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, ట్రెండింగ్, వైరల్ న్యూస్ అప్ డేట్స్ వార్తల కోసం వందేభారత్ (Vande Bhaarath) వెబ్ సైట్ ను
సందర్శించండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *