కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..
బరేలీ (ఉత్తరప్రదేశ్): కల్తీ నెయ్యి తయారీ కేసులో ఐదుగురు నిందితులకు బరేలీ కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి యాభై వేల జరిమానా కూడా విధించింది.
కల్తీ దేశీ నెయ్యి తయారు చేసిన ఐదుగురు నిందితులకు అదనపు జిల్లా జడ్జి అరవింద్ కుమార్ కోర్టు జీవిత ఖైదు విధించించారు. ఐదుగురు నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించించారు. కల్తీకి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటివరకు ఇది అత్యధిక శిక్షగా భావిస్తున్నారు. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.
2009లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన తీర్పు 14 ఏళ్ల తర్వాత ఆగస్టు 12న శనివారం వెలువడింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తేజ్‌పాల్ సింగ్ రాఘవ్ మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతోందని, కేసు విచారణ సందర్భంగా ఎనిమిది మంది సాక్షులను కోర్టు ముందు హాజరుపరిచామని తెలిపారు.
కల్తీ దేశీ నెయ్యి తయారీ ప్రక్రియ నగరంలో నేలమాళిగలో నడుస్తోంది.
ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) బులంద్‌షహర్‌కు చెందిన నలుగురు, బరేలీకి చెందిన ఒకరు ఈ కల్తీ వ్యాపారంలో పాల్గొన్నారు. ఈ కేసులో సుమారు 26 కిలోల కల్తీ దేశీ నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్, వనస్పతి నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. TCA పదార్థాన్ని నెయ్యి, ఇతర ఉత్పత్తులతో కలిపినట్లు చెప్పారు.
విచారణ సందర్భంగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తేజ్‌పాల్ సింగ్ రాఘవ్ మాట్లాడుతూ, అదనపు జిల్లా జడ్జి అరవింద్ కుమార్ కోర్టు ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించిందని, ఇద్దరు వ్యక్తులను నిర్దోషులుగా విడుదల చేశారని చెప్పారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.