రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా

రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా

ఇందుకోసం అమాయకుడి హత్య.. సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన ప్లాన్

పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చేందుకు రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును అక్రమ పద్ధతిలో కాజేయాలని ప్లాన్ చేశాడు..
ఇందుకోసం తాను చనిపోయినట్లు సీన్ చేసేందుకు తన భార్యతో పాటు మరో నలుగురితో కలిసి కుట్ర పన్నాడు. తమ ప్లాన్ అమలు కోసం ఓ అమాయకుడిని హత్యచేశారు. చివరకు వీరి మాస్టర్ ప్లాన్ ను పోలీసులు గుర్తించి కటకటాల వెనక్కు పంపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ కేసుకు సంబంధించి ఫతేఘర్ సాహిబ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) డాక్టర్ రవ్‌జోత్ కౌర్ గ్రేవాల్ వివరాలు వెల్లడించారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ తన ఫుడ్ చైన్ ఫ్రాంచైజీ వ్యాపారంలో నష్టాలు వచ్చి భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, జీవిత బీమా, ప్రమాద బీమాను క్లెయిమ్ చేయడానికి గుర్‌ప్రీత్ అతని భార్య, అతడి సహచరులతో కలిసి గురుప్రీత్ తనను తాను మణించినట్లు సీన్ క్రియేట్ చేసి రూ.4కోట్ల బీమా మొత్తాన్ని పొందాలని పన్నాగం పన్నారు.

READ MORE  అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

ఇందుకోసమే సైన్‌పూర్ ప్రాంతానికి చెందిన సుఖ్‌జీత్‌ను చంపాలనే ఉద్దేశంతో గురుప్రీత్‌ అతడితో స్నేహం పెంచుకున్నాడు. అయితే సుఖ్‌జీత్‌ అదృశ్యమైనట్లు అతడి భార్య జీవన్‌దీప్‌ కౌర్‌ ఫిర్యాదు చేయడంతో తెర వెనక జరిగిన వీరి కుట్ర వెలుగులోకి వచ్చింది. జూన్ 19 న, బాధితుడు, సుఖ్‌జీత్ సింగ్ అదృశ్యమయ్యాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్, చెప్పులు సిర్హింద్ కాలువ సమీపంలో గుర్తించారు.  అక్కడి ఆధారాలను చూసి  మొదట సుఖ్ జీత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు.

అయితే సుఖ్‌జీత్ అదృశ్యమైన రోజున గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి అతడితో ఉన్నట్లు సుఖ్‌జీత్ సింగ్ భార్య జీవన్‌దీప్‌ కౌర్‌ పోలీసులకు తెలిపింది. గురుప్రీత్ గత కొన్ని రోజులుగా తన
భర్తకు మద్యం కొంటున్నాడని పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులు విచారించగా..  గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. రాజ్‌పురా పట్టణంలోని బసంత్‌పురా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురుప్రీత్ సింగ్ మరణించినట్లు పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించి జూన్ 20న  రాజ్‌పురా (సదర్) పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే గురుప్రీత్ మృతదేహాన్ని హడావిడిగా దహనం చేసి, బూడిదను పారవేశారు. ఇది పోలీసుల్లో అనుమానాన్ని పెంచింది.”

READ MORE  జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

“డిప్యూటీ ఎస్పీ గుర్బన్స్ సింగ్ నేతృత్వంలోని బృందం గురుప్రీత్ కుటుంబ సభ్యులను  మళ్లీ ప్రశ్నించడం ప్రారంభించింది. విచారణలో చివరకు తామే సుఖ్‌జీత్‌ను చంపినట్లు వారు
వెల్లడించారు” అని ఎస్‌ఎస్‌పి తెలిపారు.

రూ.4కోట్ల బీమా కోసం మర్డర్ ప్లాన్

గురుప్రీత్ మొదట రూ.4 కోట్ల విలువైన జీవిత బీమా, ప్రమాద బీమా పాలసీలను కొనుగోలు చేసి మొదటి వాయిదాలు చెల్లించినట్లు విచారణలో తేలిందని ఎస్‌ఎస్పీ వెల్లడించారు. మొదటి  విడత చెల్లించిన తర్వాత, గురుప్రీత్.. సుఖ్‌జీత్‌తో స్నేహం చేసి, అతనిని హత్య చేసేందుకు మరో నలుగురితో కలిసి పథకం వేశాడు.

READ MORE  Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

“జూన్ 19 న, నిందితుడు నిద్ర మాత్రలు కలిపిన పానీయాన్ని సుఖ్‌జీత్ ఇచ్చాడు. అది  తాగిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తదనంతరం, వారు సుఖ్‌జీత్ ను కారులో
తరలించి, బట్టలు మార్చుకుని, రాజ్‌పురాలోని బసంత్‌పురా సమీపంలోని రోడ్డుపై మృతదేహాన్నిపడేసి  శరీరాన్ని గుర్తించకుండా ఉండేందుకు ట్రక్కుతో తొక్కించారు. దీనివల్ల ముఖం ఛిద్రమైంది. పోలీసులు సుఖ్‌జీత్‌ను గురుప్రీత్ గా తప్పుగా భావించి హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు.

చివరగా బీమా డబ్బులకోసం అమాయకుడిని హత్య చేసిన గురుప్రీత్ సింగ్, అతడి భార్యతో పాటు మరో నలుగురు – సుఖ్వీందర్ సింగ్ సంఘా, జస్పాల్ సింగ్, దినేష్ కుమార్, రాజేష్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

One thought on “రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *