EPFO Jobs | యువతకు గుడ్ న్యూస్.. డిగ్రీ విద్యార్హతతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..
EPFO Jobs | డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు సువర్ణావకాశం.. కేవలం డిగ్రీ విద్యార్హతతో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లో పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల్లో ఒక సంవత్సరం వరకు పని చేయడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 29న EPFO నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ కాంట్రాక్ట్ కాలం ఒక ఏడాది నుంచి మరో 3 సంవత్సరాలకు పొడిగించే అవకాశం ఉంది.
ఇక ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలలోపు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.65 వేల జీతం ఉంటుంది.
నియామక ప్రక్రియ
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ దశ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను తీసుకురావాలి.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు EPFO అధికారిక సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లతో పాటు గడువులోగా rpfc.exam@epfindia.gov.inకు ఇమెయిల్ చేయాలి. EPFO వివరణ లేకుండా దరఖాస్తులను తిరస్కరించే హక్కును కలిగి ఉంది.
ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు పరీక్ష లేదు. అభ్యర్థులు ఒరిజనల్ స్టడీ సర్టిఫికేట్స్ చూపించాల్సి ఉంటుంది. అలాగే ఓ సెట్ జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెట్స్ చేసి సమర్పించాలి. epfindia.gov.in అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నింపాలి. అన్ని వివరాలు నమోదు చేసిన దరఖాస్తు పత్రాన్ని, అభ్యర్థుల డాక్యుమెంట్స్ ను rpfc.exam@epfindia.gov.in కి మెయిల్ చేయాలి.
EPFO Jobs అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ముఖ్యంగా సామాజిక భద్రత లేదా కార్మిక రంగంలో సంబంధిత ప్రభుత్వ పథకాలలో పరిశోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..