
Shyam Benegal Death : చిత్ర సీమలో విషాదం.. ప్రఖ్యాత దర్శకుడు కన్నుమూత
Shyam Benegal Death News చిత్రసీమలో విషాద వార్త. ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ మార్క్ దర్శకత్వ ప్రతిభతో ఎనలేని గుర్తింపు పొందారు. సాంప్రదాయేతర చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. అతను 50 సంవత్సరాలకు పైగా పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించారు. ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో శ్యామ్ బెనెగల్ సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మంగళవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.సినిమాల్లోకి రాకముందు ఫొటోగ్రఫీLegendary Filmmaker శ్యామ్ సుందర్ బెనెగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సినిమాల ప్రపంచంలోకి రాకముందు ఎకనామిక్స్ చదివిన తర్వాత ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ ప్రపంచంలో, అతను ఆర్ట్ సినిమాకి పితామహుడిగా కూడా పరిగణించారు. ...