Donald Trump | ట్రంప్ పై మరో హత్యాయత్నం.. రెండు నెలల్లో రెండవ సారి..
Donald Trump assassination attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ వెలుపల తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ క్రమంలో రెండు నెలల్లో ట్రంప్ రెండవ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. ఆదివారం (సెప్టెంబర్ 15). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లోకి రైఫిల్‌ను గురిపెట్టి కాల్పులు జరిపిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.
ఫోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ దుండగుడు అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. హుటాహుటిన ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ కాల్పుల అనంతరం ట్రంప్ సురక్షితంగానే ఉన్నారని, ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవని ఆయన ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ట్రంప్ క్షేమంగానే ఉన్నారని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ విభాగం ధ్రువీకరించింది. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఘటన ఎలా జరిగింది?
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు గోల్ఫ్ కోర్స్ సమీపంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు AK-47తో ఉన్న వ్యక్తిని గుర్తించారు. దీంతో ఒక సీక్రెట్ ఏజెంట్ కాల్పులు జరిపగా సాయుధుడు SUVలో అక్కడి నుంచి పారిపోయాడు, రైఫిల్‌ను పడవేసి, తుపాకీని వదిలి రెండు బ్యాక్‌ప్యాక్‌లు, లక్ష్యం కోసం ఉపయోగించే స్కోప్, గోప్రో కెమెరా, పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ రిక్ బ్రాడ్‌షా చెప్పారు. తర్వాత ఆ వ్యక్తిని పొరుగు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతని ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా లేదు.
కాగా హత్యాయత్నం తర్వాత ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు
ట్రంప్ తన అభిమానులకు పంపిన సందేశంలో, తాను సురక్షితంగా ఉన్నానని తా ను “ఎప్పటికీ లొంగిపోనని” చెప్పారు. “నా పరిసరాల్లో తుపాకీ కాల్పులు జరిగాయి, కానీ పుకార్లు అదుపు తప్పడానికి ముందు, మీరు దీన్ని ముందుగా వినాలని నేను కోరుకున్నాను: నేను సురక్షితంగా ఉన్నాను. బాగానే ఉన్నాను! నేను ఎప్పటికీ లొంగిపోను!” అని ట్రంప్ అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..