ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు.
ఇది కూడా చదవండి: ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది.. Cafe Coffee Day విజయగాథ
సంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రి, బస్టాప్‌లకు మంచి కనెక్టివిటీ ఉంది. జీవీఎంసీ ఈ ప్రాంతాన్ని వీధికుక్కల బెడద లేకుండా చేయాలని వారు కోరారు.
జంతు కార్యకర్త ప్రదీప్ నాథ్ మాట్లాడుతూ, “ప్రజల ఫిర్యాదులకు మాత్రమే జివిఎంసి స్పందిస్తుంది. కుక్కలను పట్టుకునే సిబ్బంది తక్కువగా ఉన్నారు. మరోవైపు వారికి నైపుణ్యం లేదు. పశువైద్యశాలలలో కూడా తగినంత సిబ్బంది లేరు. కుక్కలకు సరైన జంతు గర్భనిరోధక ఆపరేషన్లు చేయడం లేదు.” అని తెలిపారు.
“ప్రభుత్వ కార్యక్రమం లేదా ఎవరైనా ప్రముఖులు, వీఐపీలు సందర్శించినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే జివిఎంసి సిబ్బంది అన్ని కుక్కలను పట్టుకుంటారు, కానీ వాటిని వేర్వేరు ప్రదేశాల్లో విడిచిపెడతారు, కుక్కలు ప్రాంతీయ జంతువులు, జివిఎంఎస్ సిబ్బంది పనితీరుతోనే శునకాల సమస్య పెరుగుతోంది” అని నాథ్ అన్నారు.
కుక్కల పెంపకాన్ని అరికట్టాలంటే ఒవేరియోహిస్టెరెక్టమీ లేదా స్ప్రే సర్జరీ చేయించాలి.. దీనిపై జివిఎంసి దృష్టి సారించడం లేదని స్థానికులు, జంతు కార్యకర్తలు వాపోతున్నారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి, అలాగే సలహాలు సూచనల కోసం ట్విటర్ లో సంప్రదించండి