Friday, March 14Thank you for visiting

ఆస్పత్రి మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూస్తున్న పెంపుడు కుక్క..! మనసును కదిలించే ఘటన..

Spread the love

పెంపుడు జంతువులు వాటి యజమానుల మధ్య ఉండే అనుబంధాన్ని అనేక సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే, సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్న వీడియోలను చూసినప్పుడు మన హృదయాలు ద్రవిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులకే విశాల హృదయం, దయ, ప్రేమ ఉంటుందనిపించే సన్నివేశాలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికుల బృందం సోషల్ మీడియా లో షేర్ చేసిన ఒక పోస్టు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక పెంపుడు కుక్క (Pet Dog ) తన యజమాని కోసం చూస్తున్న ఎదురుచూపులు అందరినీ కదలించేలా చేసింది. ఆ వివరాలు ఇవీ..

READ MORE  పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. పోలీస్‌ వాహనంతో పరార్‌

ఫిలిప్పీన్స్‌లోని కాల్‌కూన్ నగరంలోని MCU హాస్పిటల్ మార్చురీ ఎదుట ఒక కుక్క రోజుల తరబడి పడిగాపులు కాస్తుంది. ఆహారం, నిద్ర లేకుండా ఆ కుక్క ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇదే ఆస్పత్రికి చేరుకుని మార్చురీ ముందే నిరీక్షిస్తుూ ఉంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది, అక్కడే చదువుతున్న విద్యార్థులు ఆ కుక్కకు మోర్గాన్ (Morgan) అని పేరుపెట్టారు. మోర్గాన్ అనే పేరు ఎందుకంటే ఇది మృతదేహం ముందు ఎదురు చూస్తుందని అర్థమట. వాస్తవానికి.. మోర్గాన్ తన యజమాని అదే ఆస్పత్రిలో చేరి చనిపోగా, ఆ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆ ఘటన జరిగి ఇప్పటికి ఏడాది గడిచింది.

READ MORE  Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

మోర్గాన్ యజమాని కొవిడ్‌-19తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అతడి పరిస్థితి మరింతగా విషమించి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అతడు మృత్యువాత పడ్డాడు. కానీ అతను చనిపోయాడని తన పెంపుడు కుక్క మోర్గాన్‌కు అర్థం కాలేదు. అది చివరిసారిగా తన యజమానిని ఆస్పత్రి మార్చురీ ప్రాంగణంలోనే చూసింది. దాంతో ఆయన అందులోనే ఉన్నాడని భావించింది. కాబట్టి అది అతడి కోసం అక్కడే నిరీక్షిస్తోంది. ఒకటి, రెండు, మూడు రోజులు కాదు, నెలలు.. ఇప్పటికి సంవత్సరం గడిచిపోయిందని ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది, అక్కడ చూసినవారు చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది, చికిత్స కోసం వచ్చిన వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఇచ్చే ఆహారం తింటూ అక్కడే ఉంటుంది. తన యజమాని ఇక తిరిగి రాడని తెలియక ఆ మూగజీవి పడుతున్న ఆవేదన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది..

READ MORE  Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?