5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ!
ఆర్థికశాఖ సమీక్షలో భట్టివిక్రమార్క
శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధం..
Deputy CM, Finance Minister Mallu Bhatti Vikramarka: తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గత శుక్రవారం ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, ఇతర పూర్తి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.
కాగా తెలంగాణ రాష్ట్రం రూ. 5 లక్షల 59వేల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్ గా ఆర్థిక శాఖ బాధ్యతలను తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు చురుకుగా పనిచేయాలని మంత్రి కోరారు. ప్రభుత్వ విజయం ఆర్థికశాఖపైనే ఆధారపడి ఉంటుందన్న భట్టి.. ఉద్యోగస్తుల మాదిరిగా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రభుత్వ లక్ష్యాలు సాధించినవారమవుతామని తెలిపారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలిసికట్టుగా సాధిద్ధామని పిలుపునిచ్చారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.