Home » ఢిల్లీలో 12 అంత‌స్థుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తొల‌గిన అడ్డంకులు

ఢిల్లీలో 12 అంత‌స్థుల్లో ఆర్‌ఎస్‌ఎస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తొల‌గిన అడ్డంకులు

RSS Office

RSS Office | ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమీషన్ (DUAC) ఇటీవలే దేశ రాజధాని ఢిల్ల‌లోని ఝండేవాలన్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కొత్త కార్యాలయాన్ని పూర్తి చేయడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసింది. దీంతో కొత్త కార్యాల‌యం ప్రారంభోత్సవానికి మార్గం సుగ‌మ‌మైంది.

ఆగస్టు 1న జరిగిన సమావేశంలో ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్  NOC కోసం ప్రతిపాదనను సమీక్షించింది. అయితే నిబంద‌న‌ల ప్ర‌కారం అద‌న‌పు డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఆమోదించలేదు. ఆగస్టు 29న విషయాన్ని పునఃపరిశీలించిన తర్వాత, టవర్లు 1, 2 పూర్తి చేయడానికి NOC మంజూరు చేసింది. ఈ తాజా ప‌రిణామంతో త్వరలో భవనం పూర్తి చేసి ప్రారంభించ‌డానికి అన్నిఅడ్డంకులు తొల‌గిపోయాయి.

READ MORE  Ration Card E-Kyc Date Extended : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు..

అధికారుల‌కు సమర్పించిన డాక్యుమెంటేషన్, డ్రాయింగ్‌లు, ఫొటోల ఆధారంగా ప్రతిపాదనను స‌మీక్షించారు. దరఖాస్తు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తేలుస్తూ NOCని మంజూరు చేసింద‌ని కమిషన్ వెల్ల‌డిచింది. అంతకుముందు, ఆగస్ట్ 1న, DUAC ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్‌ని ఆమోదించిన 3D డిజైన్‌తో పోల్చి, నిర్మాణాన్ని ఫొటోల‌తో స‌హా సహా అదనపు డాక్యుమెంటేషన్‌ను సమర్పించాల‌ని ఆర్ఎస్ఎస్‌కు సూచించింది.

ఒక భవనం స్థానిక అధికారుల నుంచి పూర్తి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించడానికి ముందు, DUAC, అగ్నిమాపక శాఖతో సహా వివిధ ఏజెన్సీల నుంచి NOCలను తప్పనిసరిగా పొందాలి. 2018లో ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతి ప్రకారం 46,999 చదరపు మీటర్ల విస్తీర‌ణంలో ఝండేవాలన్‌లోని కొత్త RSS కార్యాలయం (RSS Office) 12-అంతస్తులు కలిగిన రెండు టవర్‌లలో విస్తరించి ఉంది. భవనాల్లో కార్యాలయాలు, సమావేశ గదులు, సమావేశ మందిరాలు, లైబ్రరీ ఉన్నాయి.

READ MORE  సింహానికి ఎదురెళ్లి తన ఆవును కాపాడుకున్నాడు..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్