Delhi Excise Policy | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఈడీ కస్టడి 26 వరకు పొడిగింపు
Delhi | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Excise Policy)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడు రోజులు పొడిగించింది. ఢిల్లీ కోర్టు కవితను మార్చి 26 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. అంతకుముందు విచారణ సమయంలో కవితకు ఆమె ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబ సభ్యులను కోర్టు హాలులో కలవడానికి కోర్టు అనుమతించినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. కోర్టు హాలు నుంచి బయటకు వచ్చే సమయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. మేం పోరాడుతున్నామని,. ఎన్నికల సమయంలో రాజకీయ అరెస్టులు చేయడం సరికాదని, ఈసీ జోక్యం చేసుకుని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు కవితను శనివారం ముందుగా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చినట్లు ఏఎన్ఐ నివేదిక తెలిపింది. ముఖ్యంగా, ఆమె ED కస్టడీ నేటితో (మార్చి 23) ముగియ నుండగా .. విచారణ చేయాల్సింది ఇంకా చాలా ఉందని.. ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రావడంలేదని కోర్టుకు తెలపడంతో మూడు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. కాగా.. ఐదు రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం మూడు రోజులకే అనుమతి ఇచ్చింది.
అంతకుముందు ఏం జరిగింది..
అయితే విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. సమీర్ మహీంద్రతో కలిపి కవితను ప్రశ్నించాలని, లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy ) లో రూ. కోట్లలో ముడుపులు అందాయని ఈడీ వెల్లడించింది. సౌత్‌గ్రూప్ కు రూ.100 కోట్లు చేరాయని ..కవిత ఫోన్ లో డేటాను పూర్తిగా డిలీట్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల వివరాలను చెప్పడం లేదని, ఈడీ తరఫు నాయవాది అన్నారు. కవిత మేనల్లుడి వ్యాపారానికి సంబంధించిన వివరాలు అడిగితే కవిత తనకు తెలియదని చెబుతున్ననట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం కవిత మేనల్లుడి ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయని కవితను ఆమె మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదికతో విచారిస్తున్నామని ఈడీ తెలిపింది. సోదాల్లో మేనల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
అంతకుముందు కవిత ఈడీ విచారణపై అసహనం వ్యక్తంచేశారు. రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని, దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తామని కవిత చెప్పారు.
#WATCH | At Delhi’s Rouse Avenue Court, BRS MLC K Kavitha says, “We are fighting. Making so many political arrests at the time of elections is wrong. ECI should intervene and protect democracy in this country…Jai Telangana…” pic.twitter.com/KviSWrko6d
— ANI (@ANI) March 23, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..