Dasara Holidays 2024 | ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దసరా సెలవులు వచ్చేశాయి. పండుగ హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు అందరూ ఊళ్లకు పయనమవుతున్నారు. కానీ ఊరెళ్లకా ఇంటిలో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే మన మనసంతా ఇక్కడే ఉంటుంది. దొంగలు పడకుండా పలు ముందస్తు జాగ్రత్తలు (Theft Prevention Tips) తీసుకుంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ధీమాగా ఉండొచ్చు..
అయితే దసరాకు ఊరెళ్తే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మామూలు రోజుల కంటే దసరా వంటి సెలవుల్లో పెద్ద సంఖ్యలో చోరీలు జరుగుతాయని చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే దొంగలు రెక్కీ నిర్వహించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తారని హెచ్చరించారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాకే వెళ్లాలని చెప్పారు. లేదంటే తిరిగి వొచ్చే లోపు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
- Police Safety Tips : ’దసరా పండగ సెలవుల (Dasara Holidays 2024) కు గ్రామాలకు వెళితే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంకు లాకర్లలో భద్రపర్చు కోవాలని సూచించారు. లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
- సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళాలు అమర్చుకోండి.
- తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేకుంటే డయల్ 100కు ఫోన్ చేయండి.
- వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. మీ వాహనాలకు తాళాలు వేయడం మర్చిపోవద్దు. వీలైతే చక్రాలను ఇనుప గొలుసుతో లాక్ వేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
- నమ్మకమైన వాచ్‌మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి. లేకుంటే వీరే చోరీలకు పాల్పడవచ్చు లేదంటే దొంగలకు సహకరించవచ్చు.
- ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తూ ఉండండి.
- మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్తా చెదారం, వార్తా పత్రికలు, పాలప్యాకెట్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అవి ఉంటే మీరు ఇంట్లో లేరనే అనుమానం దొంగలకు వస్తుంది. వాటినీ గమనించే దొంగలు దోపిడీకి పాల్పడుతుంటారు.
- మెయిన్ డోర్‌కి తాళం కప్ప వేసినప్పటికీ అది కనిపించకుండా కర్టెన్స్‌తో కవర్ చేయాలి. బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంచండి.. అలా చేస్తే ఇంట్లో మనుషులు ఉన్నారని భావించి దొంగలు రాకుండా ఉంటారు.
- ఇంటి చుట్టుపక్కల నమ్మకమైన ఇరుగు పొరుగు వారిని ఇంటి గమనిస్తూ ఉండమని చెప్పండి
- ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో భద్రపరచాలి.
- కింద, కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలు నిర్వహించుకోవాలి.
- ఎవరికైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 100 గానీ, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444కు ఫోన్ చేయండి
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..