Zombie Virus | శతాబ్దాల తర్వాత భయపెడుతున్న డేంజరస్ వైరస్.. కరోనాను తలదన్నే విపత్తు వస్తుందా?
Zombie Virus | కంటికి కనిపించని అతిభయంకరమైన వైరస్! అది సోకిన మనుషులు వెంటనే రాక్షసుల్లా మారిపోతారు..! కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోవడం.. అంతా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తుంటారు.. ఆలోచించే విచక్షణ జ్ఞానం కోల్పోయి కృర మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ లో ఎన్నో జాంబీ వైరస్ కథలు చూశాం కదా ! ఇప్పటివరకు ఫిక్షనల్ స్టోరీగా ఉన్న ఈ వైరస్.. తొందరలోనే వాస్తవం కాబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా మంచులో కూరుకుపోయిన ఈ ప్రమాదకరమైన వైరస్‌లు.. ఇప్పుడు బయటకు వస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. కరోనా వైరస్ (corona virus) సృష్టించిన విపత్తు నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే.. కొవిడ్ ను తలదన్నే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు మానవులపైకి అటాక్ చేసేందుకు సిద్ధమవుతుందన్న విషయం తెలిసి అందరూ షాక్ కు గురవుతున్నారు.
గ్లోబర్ వార్మిక్ కారణమా..
ఆర్కిటిక్ ఖండంలోని మంచు గ్లోబల్ వార్మింగ్ (Global Warming) కారణంగా వేగంగా కరిగిపోతోందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటిక్ లోని మంచు కరిగిపోవడంవల్ల వచ్చే విపత్తులపై పరిశోధన చేపట్టిన ఎయిక్స్ మార్సిల్లే పరిశోధకులకు.. చెమటలు పట్టే వాస్తవాలు తెలిశాయి. కొన్ని వేల సంవత్సరాల కిందట ఆర్కిటిక్ మంచులో గడ్డకట్టుకుపోయిన.. డేంజరస్ వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయన్న షాకింగ్ నిజం వారి పరిశోధనల్లో తేలింది. భూమి వేడిమి కారణంగా మంచు త్వరగా కరిగిపోవడంతో.. ఇప్పుడు ఆ వైరస్‌లు బయటకు వస్తున్నాయని వెల్లడయింది. రష్యా లోని సైబీరియన్ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు .. ఇదివరకు చూడని 13 కొత్త వైరస్‌లను 2022 లోనే గుర్తించారు. వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన సైంటిస్టులు, వీటిలో 48,500 సంవత్సరాల కిందట జాంబీ తరహా వైరస్‌లు కూడా ఉన్నాయని గుర్తించారు.. ఈ వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయని,. తొందరలోనే ఉనికిలోకి వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేశారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
జనావాసాల్లో వ్యాప్తి..
ఆర్కిటిక్ ఖండంలోని మంచు దిబ్బలు వేగిరంగా కరిగిపోవడంతో అందులోని వైరస్‌లు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోకి తరలిపోతాయని, ముఖ్యంగా జనావాసాల్లోకి వచ్చే చాన్స్ ఉందని పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి దక్షిణ ప్రాంతా ల్లో ప్రారంభమై ఉత్తర ప్రాంతాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఎయిక్స్ మార్సిల్లే పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ జాంబీ వైరస్‌లు బయటకు వస్తే పురాతన పోలియో తరహా అనారోగ్యాలు మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.. ఈ వైరస్‌ల వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందనే విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియనప్పటికీ.. .. మానవాళి మనుగడకే పెను ప్రమాదం ఉంటుందని మాత్రం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
విలువైన సమాచారం… కానీ బాధాకరం 😔