Posted in

Indian Railways | మోంతా ఎఫెక్ట్.. ప‌లు రైళ్ల‌ షెడ్యూళ్ల‌లో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి

Festive Season
Indian Railway News Updates
Spread the love

Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు నుంచి హౌరా, విశాఖపట్నం, ఖరగ్‌పూర్‌ వైపు వెళ్లే సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు NTES లేదా IRCTC వెబ్‌సైట్‌లలో తాజా సమాచారం తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.

షెడ్యూల్ మార్చబడిన రైళ్లు:

  • 12842 – MGR చెన్నై సెంట్రల్ – హౌరా ఎక్స్‌ప్రెస్: రా. 11:30
  • 22870 – చెన్నై సెంట్రల్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్: రా. 11:50
  • 22604 – విల్లుపురం – ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్: ఉద. 7:00
  • 12840 – చెన్నై సెంట్రల్ – హౌరా మెయిల్: రా. 10:40
  • 12664 – తిరుచ్చిరాపల్లి – హౌరా ఎక్స్‌ప్రెస్: ఉద. 5:50
  • 22501 – SMVT బెంగళూరు – న్యూ టిన్సుకియా ఎక్స్‌ప్రెస్: ఉద. 3:10
  • 12836 – SMVT బెంగళూరు – హతియా ఎక్స్‌ప్రెస్: రా. 8:50
  • 12503 – SMVT బెంగళూరు – అగర్తల ఎక్స్‌ప్రెస్: రా. 10:15
  • 12246 – SMVT బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్: రా. 11:15
  • 12864 – SMVT బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్: రా. 10:35

రద్దు చేసిన రైళ్లు:

  • 17248 – ధర్మవరం – నరసాపురం ఎక్స్‌ప్రెస్ (29.10.2025)
  • 17256 – లింగంపల్లి – నరసాపురం ఎక్స్‌ప్రెస్ (29.10.2025)
  • 17215 – మచిలీపట్నం – హిందూపూర్ ఎక్స్‌ప్రెస్ (28.10.2025)
  • 17216 – హిందూపూర్ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (29.10.2025)


Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *