Home » Current Charges | విద్యుత్‌ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఊరట

Current Charges | విద్యుత్‌ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఊరట

TGSPDCL Current Charges

Current Charges Hike In Telangana | హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు​ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించిన‌ట్లైంది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్ తిర‌స్క‌రించింది. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్ల‌డించారు.
40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నామ‌ని, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంద‌ని వివ‌రించారు. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేద‌న్నారు. స్థిర చార్జీలు రూ.10 యధావిధిగా ఉంటాయ‌ని, పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేద‌ని హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామ‌ని శ్రీరంగ‌రావు తెలిపారు.

READ MORE  5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ!

గృహ వినియోగదారులకు క‌నీస చార్జీలు తొలగించామ‌ని, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింద‌ని, ఆర్‌ఎస్పీ ఇవి కేవలం ఐదు నెలల వరకే ఉంటాయ‌ని తెలిపారు.. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ.54,183.28 కోట్లు ఆమోదించింద‌ని శ్రీరంగ‌రావు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్