Thursday, July 31Thank you for visiting

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో చాన్స్‌

Spread the love

స్ప‌ష్టం చేసిన‌ సీఎం రేవంత్ రెడ్డి

Outsourcing Employees Regularization : సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు (Contract Employees), ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల‌ను రెగ్యులరైజ్‌ చేస్తే న్యాయ‌స్థానాల్లో సమస్యలు వస్తాయని చెప్పారు. క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకపోయినా పట్టుబడితే సమస్య మ‌రింత జటిలమవుతుంది తప్ప పరిష్కారం కాదని ఆయ‌న అన్నారు. సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయాల్సిన పని లేదని.. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని.. అలాంటి నేతల ఉచ్చులో పడితే చివరకు ఉద్యోగులే నష్టపోతారని సీఎం రేవంత్ హితువు ప‌లికారు. ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ముఖ్య‌మంత్రి వెల్లడించారు.

సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి (beneficiaries) చేరేలా చర్యలు తీసుకోవాల‌ని, ఈ ప్రభుత్వం మనదేన‌ని రాష్ట్ర అదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం ప్ర‌జ‌ల‌కు పంచాలన్నా అది ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి.. పరిష్కారానికి వెంట‌నే కార్యాచరణ చేపడతామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *