Congress 6 Guarantees | దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ విడుదల..
దూకుడు పెంచిన బీఆర్ఎస్
BRS releases Congress 420 promises booklet: హైదరాబాద్: ఆరు గ్యారంటీల (Congress 6 Guarantees) హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అందులో మహాలక్ష్మీ పథకంలో భాగంగా విద్యార్థినులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో, హైదరాబాద్ లో సిటీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ (Free Travel for Women in Telangana) సౌకర్యం కల్పించింది కాగా, ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, కాంగ్రెస్ 420 హామీల పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బుక్ లెట్ (Congress 420 Promises Booklet) విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీల ఇవి అని బుక్ లెట్ తీసుకొచ్చింది.
ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది… హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్లెట్ ను రిలీజ్ చేసింది బీఆర్ఎస్. ముందుగానే డిసైడ్ అయ్యారో లేదో తెలియదు కానీ.. మోసానికి మారుపేరుగా నిలిచే 420 నంబర్ ఉండేలా కాంగ్రెస్ హామీలు ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినరోజు నుంచే సాకులతో హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. ఏవేవో కొర్రీలు పెడుతూ.. కొన్ని పథకాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకు తాము కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ తీసుకొచ్చామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
లోక్ సభ ఎన్నికలకు ముందే హామీలు అమలు చేపట్టాలి..
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోడ్ రాక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను.. ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు, వ్యవసాయ రంగం, విద్యా రంగం, యువత, సాగునీటి రంగం, అమరులు, మైనారిటీ, బీసీలు, మహిళా సంక్షేమం, విద్యా వైద్య రంగాలు, ఉద్యోగుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి, పర్యాటక రంగం, పర్యావరణం, గృహ నిర్మాణం సహా ఇతర హామీలు మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన అడ్డగోలు హామీలపైన భారత రాష్ట్ర సమితి ఒక బుక్లెట్ ని ప్రచురించింది.
కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కానీ అనేక… pic.twitter.com/seLZEtTnNF
— BRS Party (@BRSparty) January 3, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..