LPG cylinder | గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝలక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధరలను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అంటే అక్టోబర్ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు సదరు కంపెనీలు వెల్లడించాయి.
ధరల పెంపు తర్వాత దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. , ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా పలు రాష్ట్రాల్లో ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి. ఇక 14.2 కేజీల గృహాల్లో వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథావిధిగా కొనసాగుతాయని చమురు కంపెనీలు వెల్లడించాయి. ప్రతీ నెల 1నఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అందులో భాగంగా అక్టోబర్ 1న (Commercial LPG cylinder) మంగళవారం కూడా కొత్త ధరలను ప్రకటించాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..