Friday, December 27Thank you for visiting

CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన సీఎం యోగీ అదిత్య‌నాథ్‌

Spread the love

CM Yogi Adityanath | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath) కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ “డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ (BR Ambedkar)ను అగౌరవపరుస్తోందని, దళితులు, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని” ఆరోపించారు.

మీడియా సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కేవలం ముస్లింల గురించి మాత్రమే పట్టించుకుంటున్నదని ఆరోపించారు. నాడు అంబేద్కర్‌ ఎన్నికల్లో ఓడిపోవ‌డానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని, ఆయన చేసిన సేవలను తగిన విధంగా గౌరవించ‌లేద‌ని సీఎం యోగీ ఆరోపించారు. బాబా సాహెబ్‌కు స్మారక చిహ్నాలు నిర్మించాలని కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, అందుకు భిన్నంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు కీలక స్థలాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ ‘పంచతీర్థాన్ని’ అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు.

READ MORE  Old City Metro | 2029 నాటికి ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీ

ఎమర్జెన్సీ సమయంలో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజ్యాంగ ప్రవేశికను సవరించి ‘సెక్యులర్’ మరియు ‘సోషలిస్ట్’ అనే పదాలను ప్రవేశపెట్టిందని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఇవి అంబేద్కర్ అసలు దృష్టిలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ కలలను సాకారం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) అంకితమైందని యుపి సిఎం అన్నారు . బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్‌కు తగిన గౌరవం ఇస్తూ దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి బీజేపీ అవిశ్రాంతంగా కృషి చేసిందని తెలిపారు.

READ MORE  Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

“ప్రతి భారతీయుడు బాబా సాహెబ్‌ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఆయన దార్శనికతను నిలబెట్టడానికి, అందరికీ సామాజిక న్యాయం అందించడానికి బిజెపి కట్టుబడి ఉంది” అని యోగి పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  Assembly Election Results 2024 | అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా.. సిక్కింలో ఏకపక్ష విజయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *