CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బహిరంగ సభను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు.
త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్
త్వరలోనే ప్రియాంక గాంధీని ఆహ్వానించి లక్ష మంది ఆడపడచుల సమక్షంలో రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనేదే మా ఆకాంక్ష అని అన్నారు. నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ త్వరలో అమలు చేస్తాం. అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా చర్యలు తీసుకుంటాం. అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని తెలిపారు.
7వేల మంది స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇచ్చాం. 15 రోజుల్లో 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తాం. వారికి ఉద్యోగాలిచ్చేందుకు కోర్టు కేసులు పరిష్కరిస్తున్నాం. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువునా దోచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు లేకుండా చేసింది. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దోచుకున్నారు. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ అడవి బిడ్డలను పట్టించుకోలేదు. విద్యార్థులు, నిరుద్యోగులకు మొండిచేయి చూపారు. కానీ ప్రజలు కవితను ఓడించినా ఎమ్మెల్సీతో ఉద్యోగం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. పదేళ్ల దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు.
రాంజీగోండ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నామని CM Revanth Reddy అన్నారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటామని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధివైపు నడిపించే బాధ్యత తీసుకుంటాం 1981 ఇంద్రవెల్లి దారుణంపై ఆనాడే క్షమాపణ చెప్పాను. ఆనాడు సీమాంధ్ర పాలకుల పాలనలో ఆ తప్పు జరిగింది. అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్ పాలనను అంతం చేశాం. కేసీఆర్ పదేళ్లలో ఏమీ చేయలేదు.. మేము 2 నెలల్లో ఎలా చేస్తాం? కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కాలేదు.. అప్పుడే విమర్శించడం మొదలుపెట్టారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..