రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి (Diwali), ఛఠ్ పూజ (Chhath Puja) పండుగల సమీపిస్తున్న క్రమంలో రైల్వే కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకి అనుగుణంగా అదనంగా 12,500 కోచ్‌లను (12,500 Additional Coaches) రైళ్లకు జత చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ పండుగ సీజన్‌లో (festive season) 108 రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచామని, ఛఠ్ పూజ, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక రైళ్లకు 12,500 కోచ్‌లు అదనంగా జత చేశామని తెలిపారు. 2024-25లో పండగ వేళల్లో ఇప్పటి వరకూ మొత్తం 5,975 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించామని, ఈ నిర్ణయం దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు పండుగల సమయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సులభంగా ప్రయాణాలు సాగించవచ్చని తెలిపారు. 2023-24లో పండుగల సీజన్‌లో 4,429 ప్రత్యేక రైళ్లను నడిపించామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇదిలా ఉండగా దసరా, దీపావళి, ఛట్ పూజ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ కూడా ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడపిస్తోంది.అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12 వరకు ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటించింది. పేర్కొంది.
కాగా ప్రతీ సంవత్సరం ప్రత్యేక సందర్భాలు, పండుగ సమయాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి వంటి పెద్ద పెద్ద పండగల తోపాఉట కుంభమేళ వంటి సమయాల్లో ఆయా మార్గాల్లో పెద్ద ఎత్తున రైళ్లను నడిపిస్తోంది. ఇక ఛఠ్ పూజ (Chhath Puja) సమయంలోనూ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఉత్తర భారతంతో భక్తులు ఛఠ్ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలో ఈ పర్వదినం ఎందో ప్రసిద్ధి చెందింది. నాలుగు రోజులపాటూ జరుపుకునే ఈ వేడుకకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా సొంతూళ్లకు వస్తుంటారు. వీరికోసమే అన్ని రైల్వే డివిజన్ల పరిధిలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..