Cherlapalli | చివరి దశకు చర్లపల్లి రైల్వే టెర్మినాల్ పనులు
Cherlapalli | హైదరాబాద్: రూ.430 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ అధికారులు తెలిపారు.
పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులు రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించారు. హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న రైల్వే టెర్మినల్‌ను అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ స్టేషన్ పూర్తయిన తర్వాత 15 అదనపు రైలు సర్వీసులను నిర్వహించగలదని అధికారులు తెలిపారు. ఇది 10 అదనపు లైన్లను నిర్మించారు.. అంతేకాకుండా, రీడెవలప్‌మెంట్ స్టేషన్‌లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి, ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్‌ఫారమ్‌లు కూడా పూర్తి-నిడివి గల రైళ్లను నిలపడానికి వీలుగా విస్తరించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరితో కూడిన నగరంలోని తూర్పు ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండడంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్టేషన్, అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాలలోని ప్రజలకు రాకపోకలు సాగించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.
“ఈ స్టేషన్‌ను టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తే జంట నగర ప్రాంతంలో ఉన్న ఇతర రైలు టెర్మినల్స్‌లో రద్దీని తగ్గించడమే కాకుండా నగరంలోని తూర్పు భాగంలోని ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.
నగరంలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్ల తర్వాత ఐదో టెర్మినల్‌గా చెర్లపల్లి రానుంది.
ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్ లు
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ స్టేషన్స్టేషన్ భవనంలో ఆరు బుకింగ్ కౌంటర్లు, పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హై క్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంటాయి.
మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, రెస్ట్‌రూమ్ సౌకర్యాలు ఉంటాయి. కొత్త డిజైన్‌లో విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు, ముందువైపు ప్రకాశవంతమైన లైటింగ్‌తో కూడిన ఆధునిక ఎలివేషన్ ఉంటుంది.
రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఒకటి 12 మీటర్ల వెడల్పు, మరొక ఆరు మీటర్ల వెడల్పు కలిగి -ప్లాట్‌ఫారమ్ ను ఈజీగా మారడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.మొత్తం తొమ్మిది ప్లాట్‌ఫారమ్‌లు ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి మొత్తం ఏడు లిఫ్టులు, ఆరు ఎస్కలేటర్‌లను పొందుతాయి. అంతేకాకుండా, చర్లపల్లి టెర్మినల్‌లో కోచ్ నిర్వహణ సౌకర్యాలు కూడా ఉంటాయని వారు తెలిపారు.