
Cherlapalli railway station : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరికొద్ది రోజుల్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. పనులన్నీ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఈమేరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. మినిష్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ (MP Eetala Rajendar), మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టి.శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, రైల్వే కన్ స్ట్రక్షన్ సీఈ సుబ్రమణ్యం, రైల్వే సీనియర్ డెన్ కోఅర్డినేషన్ రామారావు, కీసర ఆర్డీఓ పులి సైదులు, కాప్రా డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రైల్వే స్టేషన్ కు అవసరమైన భూములు ఇచ్చేందుకు గాను టీజీఐఐసీ, రెవెన్యూ, అటవీ భూములు కేటాయించేందుకు ఆయా శాఖల అధికారులు అంగీకరించారు. రాంపల్లి వైపు రోడ్లు, లైట్లు, ఇతర మౌలిక వసతులు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు.
కాగా అంతకుముందు చర్లపల్లి రైల్వేస్టేషన్లో రైల్వే, మున్సిపల్, రెవెన్యూ, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, అధికారులతో ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. రైల్వే స్టేషన్ లో అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాజేందర్ సూచించారు. ఈనెల 28 లోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు.
కాగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కి చేరుకునేందుకు రోడ్లను విస్తరించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది . ప్రస్తుతం ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేలా, 12 రైళ్లను ఈ స్టేషన్ లో ఆపేలా రైల్వేబోర్డు (Indian Railways) నుంచి అనుమతులు లభించాయి. దూర ప్రాంతాలకు నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నడపబోతున్నారు. వాటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.
చర్లపల్లి నుంచి నడవబోతున్న రైళ్లు
- 12589/12590 గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ – గోరఖ్ పూర్
- 12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- 12604 హైదరాబాద్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- 18045 షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
- 18046 హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
చర్లపల్లి స్టేషన్ లో ఆగే రైళ్ల వివరాలు
- 12705/12706 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్
- 12713/123714 విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్
- 17011/17012 హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- 12757/12758 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
- 17201/17202 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్
- 17233/17234 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..