Friday, April 11Welcome to Vandebhaarath

Chandipura Virus | చండీపూరా వైర‌స్ క‌ల‌క‌లం.. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి 16 మంది మృతి

Spread the love

Chandipura Virus : గుజ‌రాత్ రాష్ట్రంలో మొత్తం 50కి పైగా చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అనుమానిత వైరస్ కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, అందులో ఏడుగురు రోగులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు.

“చండీపురా వైరస్ కు సంబంధించి మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. 16 మంది ప్రాణాలు కోల్పోయారు” అని రుషికేష్‌ పటేల్ తెలిపారు. ఈ వైరస్ కు సంబంధించి ప్రతి గ్రామం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. అలాగే కలెక్టర్లు, చీఫ్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ (CDHO), మెడికల్ కాలేజీల ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి సమావేశాలు నిర్వహించారు. “గుజరాత్‌లో, చండీపురా వైరస్ లక్షణాలు పిల్లలలో కనుగొన్నారు. ఇది కొంత ఆందోళ‌న‌ను కలిగించింది. ఏడు శాంపిళ్ల‌ను ల్యాబ్ టెస్ట్ కోసం పూణేకు పంపారు, వాటిలో చండీపురా వైరస్ ఒక కేసు మాత్రమే కనుగొనబడింది. అన్ని అనారోగ్యాల‌కు చండీపురా వైరస్ మాత్రమే కార‌ణం కాద‌ని తెలిపారు.

READ MORE  లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?

పరిస్థితిని సమీక్షించిన గుజరాత్ సీఎం

అంతకుముందు, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు. ఈ అంటువ్యాధి నియంత్రణకు తీసుకున్న చర్యలపై చ‌ర్చించారు. గుజరాత్ ఆరోగ్య మంత్రి రిషికేష్ పటేల్, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని గుజరాత్ సమాచార శాఖ పేర్కొంది. సిఎం పటేల్ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా అభివృద్ధి అధికారులు, ముఖ్య జిల్లా ఆరోగ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లో ప‌రిస్థితిని సమీక్షించారు. వ్యాధి నివారణకు జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
అంటువ్యాధిని నివారించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సులు కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని గుజరాత్ ఆరోగ్య మంత్రి సూచించారు.గుజరాత్‌లోని చాలా జిల్లాల్లో చండీపురా వైరస్ ఇన్‌ఫెక్షన్ అనుమానిత కేసులు నమోదయ్యాయి.

READ MORE  Cooking Oil | శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు వంట కోసం ఉపయోగించాల్సిన 5 రకాల నూనెలు

చండీపురా వైరస్ అంటే ఏమిటి?

Chandipura Virus :  చండీపురా వెసిక్యులో వైరస్, దీనిని చండీపురా వైరస్ (CHPV) అని పిలుస్తారు, ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినది. భారతదేశంలోని మహారాష్ట్రలోని చండీపురా జిల్లాలో 1965లో మొదటిసారిగా క‌నుగొన్నారు. ఈ వైరస్ ప్రాథమికంగా అక్యూట్ ఎన్సెఫాలిటిస్, తీవ్రమైన మెదడు వాపు, ముఖ్యంగా పిల్లలలో ఎక్కువ‌గా సోకుతుంది.

చండీపురా వైరస్ ప్రధానంగా దోమలు, పేలు, సాండ్ ఫ్లై వంటి వాహకాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ సాండ్ ఫ్లై మనుషులను కుట్టిన‌పుడు వైరస్‌ను వారి రక్తప్రవాహంలోకి వైర‌స్ ను ఇంజెక్ట్ చేసినప్పుడు ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇతర మార్గాల ద్వారా తక్కువగా వ్యాపిస్తుంది.

READ MORE  Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

చండీపురా వైరస్ సంక్రమణ లక్షణాలు సాధారణంగా అకస్మాత్తుగా కనిపిస్తాయి, కానీ వెంట‌నే పెరుగుతాయి. సాధారణ లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు. తీవ్రమైన సందర్భాల్లో, రోగులు కోమాలోకి వెళ్లిపోవ‌చ్చు. ఈ వైర‌స్ ఎక్కువ‌గా పిల్లలను సోకుతుంది. వారి లో వేగంగా వైర‌స్ అభివృద్ధి చెందుతుంది, దీనిని ముందస్తుగా గుర్తించడం, చికిత్స చేయడం అత్యంత కీలకమని గుర్తుంచుకోవాలి.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *