Bullet Train | బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టే ట్రాక్ ఇదే.. వీడియో షేర్ చేసిన అశ్విని వైష్ణవ్
Bullet Train | దేశంలో మరికొద్ది రోజుల్లోనే బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రెయిన్ నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తుస్తున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే, బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక మైన ట్రాక్‌ను రైల్వేశాఖ నిర్మిస్తోంది. తొలిసారిగా ట్రాక్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Minister Ashwini Vaishnav)ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్
దేశంలోనే తొలి బ్యాలస్ట్ లెస్ ట్రాక్ (Ballastless Track ) వివరాలను వెల్లడించారు. అహ్మదాబాద్ -ముంబై (Gujarat-Mumbai)మధ్య నిర్మిస్తున్న ట్రాక్ గురించి సమాచారం అందించారు. అలాగే బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో చూపించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో నిర్మిస్తున్న ఈ ట్రాక్‌లు బ్యాలస్ట్‌లెస్‌గా ఉన్నాయని.. కంకర, కాంక్రీట్ బ్లాక్స్ అవసరం లేని ట్రాక్‌లు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. హై-స్పీడ్ రైళ్ల బరువును మోసేందుకు ప్రత్యేకంగా కొత్తగా ఈ ట్రాక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కొత్త తరహా ట్రాక్‌లో బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిమీ వరకు వేగంతో దూసుకెళ్తాయని కేంద్ర మంత్రి వివరించారు.
ప్రపంచంలో 3వ అత్యంత కాలుష్య దేశంగా భారత్.. టాప్ 50లో 42 భారతీయ నగరాలే..
153 కిలోమీటర్ల వరకు వయాడక్ట్ పనులు పూర్తయ్యాయని.. దీంతో పాటు 295.5 కిలోమీటర్ల పీర్ వర్క్ కూడా పూర్తి అయిందని తెలిపారు. స్పెషల్ జేస్లాబ్ బాలస్ట్‌లెస్ ట్రాక్ సిస్టమ్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రాక్ సిస్టమ్ లో ముఖ్యంగా నాలుగు భాగాలు ఉంటాయి. ఆర్‌సీ ట్రాక్ బెడ్.. కాంక్రీట్ ఆస్ఫహాల్ట్ మోర్టార్ లేయర్, ఫాస్టెనర్‌లతో ప్రీ-కాస్ట్ స్లాబ్, పట్టాలతో కలిసి Bullet Train ట్రాక్ నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశంలోని రెండు చోట్ల ప్రీ-కాస్ట్ ఆర్‌సీ ట్రాక్ స్లాబ్‌లను తయారు చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు. గుజరాత్‌లోని ఆనంద్, కిమ్ ఫెసిలిటీలో తయారవుతున్నాయని.. ప్రస్తుతం సుమారు 35వేల మెట్రిక్ టన్నుల పట్టాలు అందుబాటులోకి వచ్చాయని.. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ వీడియోలో రైల్వేశాఖ వివరించింది.
Bharat’s first ballastless track for #BulletTrain !
✅320 kmph speed threshold
✅153 km of viaduct completed
✅295.5 km of pier work completed
More to come in Modi 3.0 pic.twitter.com/YV6vP4tbXS
— Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 28, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Hyderabad ki eppudu