Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు
Budget 2024 – Andhrapradesh | బడ్జెట్ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి కూడా సాయమందిస్తామని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. ఈ సాయం రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
పోలవరం నిర్మాణానికి కేంద్రం హామీ ఇచ్చిందని, వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ఏపీ జీవనాడి అని పేర్కొన్నారు. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని తెలిపారు. పారిశ్రామిక కారిడార్‌ల అభివద్ధికి ప్రాజెక్టులను తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. విశాఖ-చెన్నయ్, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రంగాల్లో కీలకమైన ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు అందిజేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తా ఆంధ్రలలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తామన్నారు. పూర్వోదయ పథకం ద్వారా తూర్పు రాష్ట్రాలు బిహార్, ఏపీ, జార్ఘండ్, బెంగాల్, ఒడిశాలకు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024లో ప్రకటించారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా
- ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం.
- విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు
- పరిశ్రమల ఏర్పాట్లుకు ప్రత్యేక రాయితీలు
- పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సాయం
- విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం
- రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధుల కేటాయంపు
- నీరు, విద్యుత్, రైల్వే, రోడ్ల ప్రాజెక్టులకు దశల వారీగా నిధుల మంజూరు
- ఆంధ్రప్రదేశ్ లో పూర్వోదయ పథకం
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..