BSNL Year long Recharge Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL ) తన కస్టమర్ల కోసం అతి తక్కువ ఖర్చుతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. కొత్త ప్లాన్ మిలియన్ల మంది వినియోగదారులకు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఇది సగటు రోజువారీ ధర కేవలం రూ. 3.50 మాత్రమే.. అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ ధరలను పెంచుతుండగా, మరోవైపు BSNL మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి పాత కస్టొమర్లను నిలుపుకోవడానికి బడ్జెట్ ఫ్లెండ్లీ ఎంపికలను అందించడం ద్వారా భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తోంది.
రూ. 1,198 వార్షిక రీఛార్జ్ ప్లాన్: వివరాలు
BSNL Year long Recharge Plan : కొత్త BSNL రీఛార్జ్ ప్లాన్, దీని ధర రూ. 1,198, ఇది 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. BSNLని సెకండరీ సిమ్‌గా ఉపయోగించే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది.
ఈ ప్లాన్‌తో, వినియోగదారులు నెలకు సుమారు రూ.100 చెల్లిస్తారు. సబ్‌స్క్రైబర్‌లు భారతదేశంలో అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌లోనైనా ప్రతి నెలా 300 నిమిషాలు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, ఇది 3GB హై-స్పీడ్ 3G/4G డేటాను, నెలకు 30 ఉచిత SMSలను అందుకోవచ్చు. ఇంకా, ప్లాన్‌లో ఉచిత జాతీయ రోమింగ్ ఉంది. ఇది భారతదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్‌లకు ఎటువంటి అదనపు ఛార్జీలు విధించరు.
వార్షిక రీచార్జి ప్లాన్ల ధరలు తగ్గింపు
కొత్త లాంచ్‌తో పాటు, BSNL మరో 365 రోజుల ప్లాన్ ధరను తగ్గించింది. ఈ ప్లాన్ ధర మొదట్లో రూ. 1,999 గా ఉండేది. ఇప్పుడు ఇది రూ. 1,899కి తగ్గించింది. ఇది నవంబర్ 7 (2024) వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 600 GB డేటా (రోజువారీ క్యాప్ లేకుండా) రోజుకు 100 ఉచిత SMSలు ఉంటాయి.