BSNL VoWiFi service : మీరు BSNL వినియోగదాలైతే మీకో గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం క్రమం తప్పకుండా అనేక అప్‌డేట్స్‌ను అందిస్తోంది. ఈసారి, మొబైల్ నెట్‌వర్క్ లేకుండా కూడా వినియోగదారులు వాయిస్ కాల్స్ చేయగలిగే ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. కొత్త ఫీచర్ గురించి మరింత తెలుసుకుందాం…
BSNL తన కొత్త VoWiFi (వాయిస్ ఓవర్ Wi-Fi) సేవను ప్రారంభించింది. ఇది వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కూడా Wi-Fi కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ సేవను అందిస్తున్న ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీల సరసన బిఎస్ఎన్ఎల్ చేరింది.
బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ విస్తరణ
BSNL తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని VoWiFi సేవలను ప్రారంభించడం గమనార్హం. ఇది ఒక కీలకమైన విజయంగా భావిస్తోంది. BSNL ఇటీవల దేశవ్యాప్తంగా 100,000 కంటే ఎక్కువ మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా తన 4G సేవను విస్తరించింది. భవిష్యత్తులో సుమారు 97,500 టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ప్రస్తుతం, ఈ సేవ దక్షిణ, పశ్చిమ సర్కిల్‌లలో ప్రారంభించింది. అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. మరోవైపు BSNL ఇటీవల ముంబైలో 4G, eSIM సేవలను ప్రారంభించింది, ఇవి గతంలో తమిళనాడులో ప్రారంభించబడ్డాయి.
VoWiFi సర్వీస్ ఎలా పని చేస్తుంది?
ఈ సర్వీస్ నెట్‌వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో ఉపయోగకంగా ఉంటుంది. వినియోగదారులు తమ ఇంటి Wi-Fi లేదా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా దీనిని ఉపయోగించవచ్చు, అంతరాయాలు లేకుండా స్పష్టమైన, స్థిరమైన కాల్స్ ను చేయవచ్చు. అయితే, దీనికి వినియోగదారు స్మార్ట్‌ఫోన్‌లో VoWiFi అవసరం. అయితే, ఈ ఫీచర్ ఇప్పుడు Android, iPhone పరికరాల్లో అందుబాటులో ఉంది.
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఉచిత వీవోవైఫై సేవలు
BSNL తన అధికారిక X ఖాతా ద్వారా, ఈ కొత్త VoWiFi సేవ పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. కాల్స్ చేయడానికి వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీలు అవసరం లేదు. ఈ సేవ వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని మరియు అదనపు ఖర్చు లేకుండా సజావుగా కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. BSNL తీసుకున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు Airtel, Vi వంటి ప్రధాన టెలికాం కంపెనీలతో పోటీ పడనుంది. ఈ ప్రైవేట్ కంపెనీలు గతంలో Wi-Fi కాలింగ్‌ను అందించగా, BSNL ఇప్పుడు ఆ జాబితాలో చేరింది.




