BSNL BiTV Service | BSNL వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా తమ మొబైల్ ఫోన్లలో 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు.గత నెలలో పుదుచ్చేరిలో ట్రయల్ లాంచ్ అయిన తర్వాత కంపెనీ తన డైరెక్ట్-టు-మొబైల్ టీవీ సర్వీస్, BiTV, భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకొచ్చింది. OTT అగ్రిగేటర్ OTT Play సహకారంతో, ఈ కొత్త సర్వీస్ వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలోనే వివిధ రకాల ప్రముఖ OTT కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
BiTV అధికారిక లాంచ్ కు సంబంధించి BSNL తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ ద్వారా ధృవీకరించింది. BiTV ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది, వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నిరంతరాయంగా అధిక-నాణ్యత కంటెంట్, వినోదం కోసం సిద్ధంగా ఉండమని వెల్లడించింది.
ఈ కార్యక్రమాన్ని BSNL CMD, A రాబర్ట్ J రవి ఆవిష్కరించారు. OTT సేవల యుగంలో సాంప్రదాయ DTH సబ్‌స్క్రిప్షన్‌లు తగ్గుతూనే ఉన్నందున, BSNL నేరుగా మొబైల్ పరికరాలలో లైవ్ ఛానెల్‌లను చూడటానికి వినియోగదారుకు అవకాశం కల్పించినట్లు తలెఇపారు.
BiTVతో, వినియోగదారులు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు 300 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు. BSNL SIM కార్డ్ ఉన్న వారికి ఈ సేవ పూర్తిగా ఉచితం. గత సంవత్సరం జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ఏడు కొత్త సేవలను ప్రకటించింది, ఇందులో IFTV, డైరెక్ట్-టు-మొబైల్ (D2M) ఉన్నాయి.
BSNL IFTV సర్వీస్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో BSNL ఇటీవల కాలంతో తన దూకుడు పెంచింది. అనేక రాష్ట్రాల్లో తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారిత IFTV సేవను ప్రారంభించింది, అదనపు ఖర్చులు లేదా సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండా 500కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తోంది. ఈ సేవ ఇటీవల తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లతో పాటు గుజరాత్ టెలికాం సర్కిల్‌లో ప్రవేశపెట్టింది.
IFTV ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది వీడియో ఆన్ డిమాండ్ (VoD)ని కూడా అందిస్తుంది. వినియోగదారులు Google Play Store లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న IFTV యాప్ ద్వారా ఈ సేవను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


