Saturday, August 30Thank you for visiting

తాజా వార్తలు

Breaking News, National, State, Trending News Upadate

Amit Shah | జమ్మూలో కాశ్మీర్ లో ‘జీరో టెర్రర్ ప్లాన్’ తో హోంమంత్రి అమిత్ షా..

Amit Shah | జమ్మూలో కాశ్మీర్ లో ‘జీరో టెర్రర్ ప్లాన్’ తో హోంమంత్రి అమిత్ షా..

National, తాజా వార్తలు
Jammu Kashmir zero terror plan | జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల తర్వాత శాంతిభద్రతల పరిస్థితిపై  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ సమావేశంలో  కాశ్మీర్ లోయలో గతంలో అమలు చేసిన విజయవంతమైన 'ఏరియా డామినేషన్ ప్లాన్'  'జీరో టెర్రర్ ప్లాన్'లను జమ్మూ డివిజన్‌లో పునరావృతం చేయాలని హోం మంత్రి భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు.జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై హోంమంత్రికి సమగ్ర వివరణ ఇచ్చారు. మిషన్ మోడ్‌లో పని చేయాలని,  సమన్వయంతో పనిచేసి త్వరితగతిన ప్రతిస్పందించాలని అమిత్ షా అన్ని భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు. ఉగ్రవాదం అత్యంత వ్యవస్థీకృత తీవ్రవాద హింసాత్మక చర్యల నుంచి కేవలం ప్రాక్సీ వార్‌గా పరమితమైనట్లు ఇటీవలి సంఘటనలను బట్టి తెలుస్తోందని అన్నారు.భద్రతా బలగాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో...
PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

National, తాజా వార్తలు
PM KISAN Scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20,000 కోట్ల నిధుల‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుద‌ల చేయ‌నున్నారు. ఈనెల 18న వారణాసిలో PM-KISAN పథకానికి సంబంధించి 17వ విడత విడుదలతోపాటు 30,000 స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోదీ సర్టిఫికేట్‌లను కూడా అందజేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 10న సుమారు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 20,000 కోట్లను పంపిణీ చేసే లక్ష్యంతో పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు.ఫిబ్రవరి 2019లో PM KISAN Scheme ను ప్రారంభించారు. ఈ స్కీం లో చేరిన రైతులకు ఏడాదికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని రూ. 2,000 చొప్పున మూడు వాయిదాల్లో నేరుగా రైతుల ఆధార్-లింక్డ్ బ్యాంక్...
Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

National, తాజా వార్తలు
Ayodhya on high alert  | రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ బెదిరించడంతో శుక్రవారం అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు, మహర్షి వాల్మీకి విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైరల్‌గా మారిన బెదిరింపు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. దీనిని ప్రతిస్పందనగా, భద్రత, నిఘా చర్యలు ప‌టిష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రామమందిరం, దాని ప్రక్కనే ఉన్న అప్రోచ్ రోడ్లు, ఇతర ప్రధాన సంస్థల చుట్టూ భద్రతను పెంచారు.2005లో రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఉగ్రవాదుల దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్ ...
కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

కేరళ వయనాడ్​ నుంచి ప్రియాంక గాంధీ పోటీ..?

National, తాజా వార్తలు
Priyanka Gandhi Lok Sabha elections : కాంగ్రెస్​ పార్టీకి సోనియాగాంధీ, రాహుల్ త‌ర్వాత‌ వెన్నెముకగా ఉంటున్న ప్రియాంక గాంధీ.. ఎట్టకేలకు ఎన్నిక‌ల్లో పోటి చేయ‌నున్న‌ట్లు వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రాహుల్​ గాంధీ గెలిచిన కేరళ వయనాడ్​ నుంచి ఆమె పోటీ చేయ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రియాంక గాంధీ 2019 నుంచి కాంగ్రెస్​లో క్రియాశీలకంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఎన్నికల్లోనూ పోటి చేయ‌లేదు. గ‌తంతో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆమె యూపీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తన మనసులో మాట బయటపెట్టారు.. కానీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌లేదు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్​ గాంధీ యూపీలోని రాయ్ బ‌రేలీ, కేర‌ళ‌లోని వాయ‌నాడ్ రెండు సీట్లల్లో పో...
Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్ మూడ‌వ‌సారి నియామ‌కం

Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్ మూడ‌వ‌సారి నియామ‌కం

National, తాజా వార్తలు
NSA Ajit Doval | జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా అజిత్ దోవ‌ల్(Ajit Doval) మ‌రోసారి నియ‌మితుల‌య్యారు. మూడో సారి ఆయ‌న ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌నున్నారు. ఇక ప్ర‌ధాన మంత్రికి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా డాక్ట‌ర్ పీకే మిశ్రాను నియ‌మించారు. ఈనెల 10 నుంచి నియామ‌కాలు అమ‌లులోకి రానున్న‌ట్లు అపాయింట్స్ క‌మిటీ తెలిపింది. ప‌ద‌వీకాలం స‌మ‌యంలో పీకే మిశ్రాకు క్యాబినెట్ మంత్రి హోదా ర్యాంక్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీకి స‌ల‌హాదారులుగా అమిత్ ఖేర్‌, త‌రుణ్ క‌పూర్‌ల‌ను నియ‌మించారు. డాక్టర్ మిశ్రా PMOలో పరిపాలనా వ్యవహారాలు, నియామకాలను నిర్వహిస్తుండగా, దోవల్ జాతీయ భద్రత, సైనిక వ్యవహారాలు, ఇంటెలిజెన్స్‌ బాధ్యతలను నిర్వహిస్తారు.ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ అజిత్ దోవల్ (Doval)   ప్రధానమంత్రికి అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరు.  2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. కేరళ కేడర్‌కు చెందిన 1968-బ్యాచ్ IPS అధికారి,...
Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

National, తాజా వార్తలు
Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. మోదీతో పాటు, కూటమి భాగస్వామ్య సభ్యులతో సహా NDA నాయకులు కూడా కేబినెట్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 240 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 272 పూర్తి మెజారిటీని సాధించలేకపోవ‌డంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసి 292 సీట్ల‌తో కాషాయ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నారా చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి), నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (LJP), జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) ఇతర కూటమి సభ్యుల మద్దతుతో. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపుదిద్దు...
Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

National, తాజా వార్తలు
Shivraj Singh Chouhan | బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 30 ఏళ్ల‌కు పైగా పార్టీ ప‌ద‌వుల్లో సేవ‌లందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌కుండా దూరం పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి ఆరోసారి రికార్డు స్థాయిలో 8.21 లక్షల ఓట్ల తేడాతో ఘ‌న విజయం సాధించారు.నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయించి (2018లో) 18 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న సమయంలో, చౌహాన్ తనను తాను బలహీనమైన రాజకీయ నాయకుడి నుంచి అసమానమైన కృషితో తెలివైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా ఎదిగారు.65 ఏళ్ల చౌహాన్ రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించారు. రాష్ట్రాన్ని మ‌రింత‌ అభివృద్ధి చేస్తాన‌ని వాగ్దానం చేస్తూ ప్రజల్లో తానూ ఒకడిగా చూ...
MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !

MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !

National, తాజా వార్తలు
Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్‌డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న యువ నేత, ఎల్‌జెపి (రామ్ విలాస్) పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ (chirag paswan) , మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది.మొదటి, రెండవ విడ‌త‌ నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వాలలో సైతం మంత్రివ‌ర్గంలో చిరాగ్ పాశ్వాన్‌కు చోటు ద‌క్కింది. పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఆయ‌న తండ్రి రికార్డుస్థాయిలో 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజ‌కీయాల్లో తన తండ్రి బాట‌లో న‌డిచిన‌ చిరాగ్ పాశ్వాన్.. త‌న ప్రయాణంలో ఈ ఎన్నికలు కీలక మైలురాయిగా నిలిచాయి. ఎల్‌జేపీ లో చిరాగ్...
Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..

Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..

National, తాజా వార్తలు
Modi Oath Ceremony Live : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు,బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలను దేశ రాజధానిలోని ప్రధానమంత్రి ఇంటికి  తేనీటి విందుకు ఆహ్వానం అందింది. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ప్రధానమంత్రి మంత్రివర్గంలో చేరి ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జేడీ(ఎస్) నేతలు హెచ్‌డీ కుమారస్వామి వంటి సీనియర్ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న ఎంపీల జాబితానితిన్ గడ్కరీ (మ‌హారాష్ట్ర ) రాజ్‌నాథ్ సింగ్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్) పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా కిరణ్ రిజిజు హెచ్‌డి కుమారస్వామి (క‌ర్నాట‌క‌) చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌) రామ్ నాథ్ ఠాకూర్ జితన్ రామ్ మాంజీ జయంత్ చౌదరి అనుప్రియా పటేల్ ప్రతాప్ రావ్ జాదవ్ (SS)...
Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

National, తాజా వార్తలు
Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొద‌ట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివ‌ర్గంలో మిత్ర‌ప‌క్షాల‌కు కూడా పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుద...