Thursday, April 10Welcome to Vandebhaarath

Delhi | బిర్యానీకి డబ్బు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు పొడిచి చంపిన 16 ఏండ్ల కుర్రాడు

Spread the love

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బిర్యానీకి (Biryani) డబ్బులు ఇవ్వలేదని 17 ఏళ్ల యువకుడిని ఓ కుర్రాడు కత్తితో పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతడిపై డ్యాన్స్‌ చేశాడు. బాధితుడైన 17ఏళ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్‌ (Jafrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ కాలనీ మీదుగా (Janta Mazdoor Colony) కాలి నడకన వెళ్తున్నాడు. ఈ క్రమంలో 16 సంవత్సరాల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినేందుకురూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు.
అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పగా ఆవేశానికిలోనైన ఆ కుర్రాడు అతడిని కొట్టాడు. దీంతో కింద పడిపోయిన బాధితుడిపై నిందితుడు కూర్చుని మెడ, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటికీ శాంతించని ఆ కుర్రాడు అతని మృతదేహంపై డ్యాన్స్‌ చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యవహారమంతా ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన ఆ కుర్రాడు కూడా జఫ్రాబాద్‌లోని మురికి వాడలో నివసిస్తున్నాడని, అతడు మధ్యలోనే పాఠశాల విద్యను ఆపేశాడని చెప్పారు. ఇద్దరు ఒకరికొకరు పరిచయం లేదని వెల్లడించారు. గతంలోనూ అతడి పై ఓ హత్య కేసు ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

READ MORE  Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

READ MORE  ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *