BJP Manifesto | రేపే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల.. ఏయే హామీలు ఉండనున్నాయి..?
BJP Manifesto | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha polls) కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ముచ్చటగా మూడోసారి మరోసారి అధికారంలోకి వచ్చేస్తామని ధీమాగా ఉంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ అలుపు దేశవ్యాప్తంగా రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో (BJP Manifesto) ను ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో విడుదల చేయనుంది.
సంకల్ప పాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనుంది. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. మోదీ గ్యారెంటీ, వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దాదాపు 15 లక్షల సూచనలు
అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా ఈ మేనిఫెస్టోను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు రాగా.. ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రజలు నమో యాప్ ద్వారా తెలిపారు. మేనిఫెస్టో కోసం 15 లక్షల సూచనలు బీజేపీకి అందాయి. వాటిలో 4 లక్షల సూచనలు ‘నమో యాప్’ ద్వారా, 11 లక్షల సలహాలు వీడియోల రూపంలో అందాయి. 27 మందితో కూడిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కో ఆర్డినేటర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కో కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.
ఈ సూచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన కీలకమైన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచే చాన్స్ ఉంది. అభివృద్ధి భారతం లక్ష్యంగా మహిళలు, యువత, పేదలు, రైతుల అభ్యున్నతికి మేనిఫెస్టో భరోసా ఇవ్వనుంది. సాధించగలిగిన హామీలను మాత్రమే ఇవ్వడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశంగా ప్రకటించనున్నారు. కల్చరల్ నేషనలిజంపై దృష్టి సారిస్తూ 2047 నాటికి అభివృద్ధి భారతం సాధిస్తామనేది మోదీ ప్రధాన గ్యారెంటీగా ఉండనుంది. ‘సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ సబ్‌కా ప్రయాస్‘ అనే మంత్రంతో సంకల్ప్ పత్ర ఉటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. పంచ న్యాయాలు, 25 గ్యారంటీలను అందులో ప్రకటించిచిన విషయం తెలిసిందే.
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..