
Telangana News | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం విస్తరిస్తోందని, యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని విమర్శించారు.. వనపర్తి (Vanaparthi)లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడారు. వనపర్తి జిల్లాతో నాకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కానీ ప్రజల కష్టాలను పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల తమ భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా తగిన పరిహారం ఇవ్వలేదు. ఎత్తిపోతల నిర్మాణాల వల్ల భూములు కోల్పోయిన వారికి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ఏం అయింది? ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. అయితే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ప్రజల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా నాశనం చేయకూడదు. మనకు కావాల్సింది ‘ఉడ్తా తెలంగాణ’ కాదు… అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలి. అని రాంచందర్ రావు ఆకాంక్షించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.