Posted in

New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

New Energy Policy in Telangana
New Energy Policy in Telangana
Spread the love

New Energy Policy in Telangana |  తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka)  పలు కీలక విషయాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ఈ సందర్భంగా ప్రారంభించారు.

ఇప్పటికే రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 11న సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. త్వరలో ఎనర్జీ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కొత్త పాలసీపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఈ నూతన పాలసీని తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2034-35 నాటికి రాష్ట్రంలో 31,809 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అవకాశం ఉంటుందని, దీనికి అనుగుణంగా విద్యుత్ ఉత్పాదకతను పెంచుతామని భట్టి చెప్పారు. రాష్ట్ర అవసరాలకు కొరత లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అన్నారు. గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తికి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని భట్టి తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా 2025 మార్చి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రీడ్ కు అనుసంధానం చేస్తామని అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *