
సదానందన్ మాస్టర్‌కు భారతీయ జనతా పార్టీ గౌరవం
రాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తిరిగి పునర్మించుకున్న ఒక వ్యక్తి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) ..
కేరళలో కమ్యూనిస్టుల చేతుల్లో పాశవిక దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయినా… ఆ బాధను స్ఫూర్తిగా మార్చుకుని దేశభక్తి మార్గాన్ని వదలకుండా ముందుకు సాగిన ఓ సాధారణ ఉపాధ్యాయుడు సి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) . ఆయన జీవిత యాత్ర ఇప్పుడు మరో మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఆయనను ఎంపిక చేసింది. ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తిగత గౌరవం కాదు… దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల హింసకు బలి అయిన లక్షలాది దేశభక్తుల త్యాగాలకు గుర్తింపు కల్పించే ఘట్టమని చెప్పవచ్చు. . . రాజ్యసభకు సి సదానందన్ మాస్టర్ నామినేట్ కావడం.. బెదిరింపులు హింసాత్మక దాడులను ఎదుర్కొని తన భావజాలానికి దృఢంగా నిలిచిన RSS కార్యకర్తల త్యాగానికి బిజెపి ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నారు.
ఇక ఆయన జీవన ప్రస్థానంలోకి వెళితే.. బాధాకరమైన ఎన్నో ఘటనలు కనిపిస్తాయి. కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించిన సదానందన్ మాస్టర్ తన కళాశాల రోజుల్లో సీపీఎం సభ్యుడిగా చురుకుగా ఉండేవారు. ఆయన పాఠశాల విద్యను మట్టన్నూర్ శివపురం హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పూర్తి చేశారు, అక్కడ మాజీ ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తరువాత ఆయన మట్టన్నూర్ పళస్సి రాజా ఎన్‌ఎస్‌ఎస్ కళాశాలలో ప్రీ డిగ్రీ కోర్సు పూర్తి చేసి, కుతుపరంబ సెయింట్ నారీస్ కళాశాలలో డిగ్రీ కోర్సును అభ్యసించారు. గౌహతిలోని ఒక కళాశాలలో బిఎడ్ పూర్తి చేసిన తర్వాత ఆయన కన్నూర్‌లోని కుళికల్ ఎల్‌పి స్కూల్‌లో చేరారు.
ఇదే సమయంలో, ఆయనకు CPM నాయకులతో అభిప్రాయ విభేదాలు ఏర్పడ్డాయి. మరోవైపు RSS భావజాలం పట్ల ఆకర్షితుడయ్యారు.. కొంతమంది స్నేహితులతో కలిసి, CPM బలమైన కోట అయిన మట్టన్నూర్‌లో RSS శాఖను ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలను CPM నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఆర్ఆర్ఎస్ లో సదానందన్ చురుకుగా పనిచేస్తుండడంతో ఆయనను కన్నూర్‌లో RSS బౌద్ధిక్ ప్రముఖ్‌గా నియమించారు.
జనవరి 25, 1994న, సిపిఎం కార్యకర్తలు అని భావిస్తున్న ఒక ముఠా, సదానందన్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును అడ్డగించి, అతన్ని బయటకు లాగి, అతని రెండు కాళ్లను నరికివేసింది. అతను నొప్పితో విలవిలలాడుతుండగా, అతని తెగిన కళ్లు మళ్లీ అతకకుండా శస్త్రచికిత్సకు వీలు లేకుండా చేయడానికి దుండగులు రోడ్డుపై తెగిపోయిన కాళ్లపై మట్టి పోసినట్లు చెబుతారు. సదానందన్ తన సోదరి వివాహానికి బంధువులను ఆహ్వానించడానికి వెళుతుండగా పెరిన్చేరి వద్ద ఈ దాడి జరిగింది.
ఆ సమయంలో సదానందన్ వయసు 30 సంవత్సరాలు. కోలుకున్న తర్వాత, కృత్రిమ కాళ్ల సహాయంతో నడవడం ప్రారంభించారు. అతను కుళికల్ LPSలో రెండున్నర సంవత్సరాలు మాత్రమే పనిచేశాడు. తరువాత, త్రిస్సూర్ జిల్లాలోని పెరమంగళంలోని శ్రీ దుర్గావిలాసం హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉద్యోగం సంపాదించడానికి RSS అతనికి సహాయం చేసింది. అతను ఆ పాఠశాలలో 25 సంవత్సరాలు సోషల్ సైన్స్ టీచర్‌గా పనిచేసి 2020లో సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు. అతని భార్య వనితా రాణి టీచర్‌గా, కుమార్తె యమునాభారతి బిటెక్ చదువుతోంది.
“జీవనోపాధి కోల్పోయి, చేతులు, కాళ్ళు కోల్పోయి కష్టాల పాలైన హింసాత్మక భావజాలానికి వ్యతిరేకంగా పటిష్ఠంగా పోరాడిన సదానందన్ రాజ్యసభకు నామినేట్ చేయడం లక్షలాది మంది జాతీయవాదులకు ఇది ఆనందం ఓదార్పునిచ్చే విషయమని. ప్రపంచవ్యాప్తంగా అమానవీయ కమ్యూనిస్ట్ భావజాలం, హింసకు వ్యతిరేకంగా సదానందన్ మాస్టర్ జాతీయవాద ప్రతిఘటనకు చిహ్నం” అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అన్నారు. “నాకు అప్పగించిన లక్ష్యాన్ని నేను వినయంతో అంగీకరిస్తున్నాను. పార్టీ నిలబెట్టిన విక్షిత్ భారత్, విక్షిత్ కేరళం కలను సాకారం చేసుకోవడానికి నేను తీవ్రంగా కృషి చేస్తాను” అని సదానందన్ మాస్టర్ చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.