
Bharat Taxi : ఓలా, ఉబర్ లకు సవాల్ విసరనున్న భారతదేశపు మొట్టమొదటి టాక్సీ సర్వీస్
Bharat Taxi | ఓలా, ఉబర్ వంటి కార్పొరేట్ రైడ్-హేలింగ్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి కొత్తగా భారత్ టాక్సీ వస్తోంది. ఈ ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో నవంబరు నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. తొలుత 650 మంది సొంతవాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధానిలో సేవలందించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను విస్తరించనున్నారు.
భారత్ టాక్సీ (Bharat Taxi)ని కేంద్ర ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ, జాతీయ ఇ-గవర్నెన్స్ విభాగం (NeGD) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, సహకార సంస్థగా ఉంటుంది. అందువల్ల, డ్రైవర్లు కూడా సహ యజమానులుగా ఉంటారు.
సహకార్ టాక్సీ ఈ సేవను నిర్వహిస్తుంది. దీనిని నిర్వహించడానికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు.
అమూల్ ఎండీ జయేన్ మెహతా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అముల్ (జిసిఎంఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సమయంలో, ఎన్‌సిడిసి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గుప్తా సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Bharat Taxi సేవను ఎలా ఉపయోగించాలి?
ఈ సేవను ఉపయోగించడం ఓలా లేదా ఉబర్ యాప్‌ను మాదిరిగానే సులభంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి “భారత్ టాక్సీ” యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ స్టోర్ నుండి దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషలలో అందుబాటులో ఉంటుంది.



